AP TG Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపటికి వాయుగుండంగా మార్పు..ఏపీలో వర్షాలు, తెలంగాణలో ఎండలు
AP TG Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారానికి వాయుగుండంగా బలపడనుంది. కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
AP TG Weather Updates: నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
అల్పపీడన ప్రభావంతో రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
23 మే గురువారం:
పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
24 మే శుక్రవారం :
• అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది.
• శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
25 మే,శనివారం :
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• కాకినాడ, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి అనంతపురం జిల్లా నార్పల 26.5మిమీ, చిత్తూరులో 22.5మిమీ, అనంతపురం బికె సముద్రంలో 22 మిమీ, చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో 21.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో ఎండలు….
గత కొద్ద రోజులుగా చిరు జల్లులు, వర్షాలతో ఉపశమనం పొందుతున్న తెలంగాణ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా..మరి కొన్నిచోట్ల ఉష్ణోగ్ర తలు పెరిగాయి. మంగళవారం తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో 43.4 డిగ్రీలు, కుమురంభీం జిల్లాలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాప్రా లలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతా లలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ నగరంలో ఎండ వేడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వికారాబాద్ జిల్లా కొడంగల్, నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.గా పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభా వంతో బుధవారం అల్పపీడనం ఏర్పడనుందని వాతావ రణశాఖ తెలిపింది. ఇది వాయుగుం డంగా మారే సూచనలు ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడొచ్చని ఐఎండి హైదరాబాద్ శాఖ అంచనా వేసింది.
సంబంధిత కథనం