AP TS Rain Alert : మే 23 వరకు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, ఐఎండీ అలర్ట్!-ap ts weather upto may 23rd many districts in telugu states may get heavy rains forecast ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Ts Rain Alert : మే 23 వరకు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, ఐఎండీ అలర్ట్!

AP TS Rain Alert : మే 23 వరకు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, ఐఎండీ అలర్ట్!

May 18, 2024, 04:26 PM IST Bandaru Satyaprasad
May 18, 2024, 04:26 PM , IST

  • AP TS Rain Alert : ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన తెలిపింది. మే 23 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన తెలిపింది. మే 23 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 

(1 / 6)

మే 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మే 24 నాటికి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రకటిచింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని వెల్లడించింది. 

(2 / 6)

ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది వాతావరణ శాఖ తెలిపింది.  ద్రోణి ప్రభావంతో మే 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  ఏపీలోని కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. 

(3 / 6)

ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో నైరుతీ రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఆదివారం నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతాల‌పై నైరుతీ రుతుప‌వ‌నాలు విస్తరించ‌నున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.  

(4 / 6)

నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి  తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మి ఎత్తులో  కొనసాగుతోంది.  నిన్న  రాయలసీమ, పరిసర ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీనపడింది. 

(5 / 6)

తెలంగాణలో పలు జిల్లాల్లో రాగల ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతారవణ అధికారులు తెలిపారు. ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కి. మీ. వేగంతో  వీచే ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ. వేగంతో  వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు  కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.  

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు