NDA's 38 vs Opposition's 26: ఎన్డీయేలో 38.. విపక్షంలో 26.. ఇంతకీ ఏ కూటమిలో ఏ పార్టీ ఉందో చూద్దామా…
NDA's 38 vs Opposition's 26: దేశ రాజకీయాల్లో వేడి పెరిగింది.. వేగం పెరిగింది. 2024 ఎన్నికల యుద్ధానికి అధికార ఎన్డీయే కూటమి, విపక్ష కూటమి రంగం సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం రెండు కూటములు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
బెంగళూరులో జరుగుతున్న విపక్ష భేటీలో పాల్గొన్న టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (ANI)
NDA's 38 vs Opposition's 26: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే లక్ష్యంతో విపక్ష పార్టీలు మంగళవారం బెంగళూరులో సమావేశం నిర్వహిస్తున్నాయి. ఈ భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న 26 పార్టీలు హాజరవుతున్నాయి. మరోవైపు, ఢిల్లీలో ఇదే రోజు బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే పక్షాల సమావేశం జరగబోతోంది. ఆ భేటీకి 38 భాగస్వామ్య పక్షాలు హాజరవుతున్నాయని బీజేపీ చెబుతోంది. ఇంతకీ ఏ కూటమిలో ఏ పార్టీ ఉందో చూద్దామా..
Opposition Alliance: విపక్ష కూటమి
ఈ కూటమిలో ప్రస్తుతానికి 26 పార్టీలు ఉన్నాయి. అవి
- కాంగ్రెస్ 2. టీఎంసీ 3. ఎన్సీపీ 4. ఆప్ 5. డీఎంకే 6. జేడీయూ 7. ఆర్జేడీ 8. జేఎంఎం 9. శివసేన (ఉధ్ధవ్ ఠాక్రే వర్గం) 10. సమాజ్ వాదీ పార్టీ 11. రాష్ట్రీయ లోక్ దళ్ 12. అప్నా దళ్ 13. నేషనల్ కాన్ఫెరెన్స్ 14. పీడీపీ 15. సీపీఎం 16. సీపీఐ 17. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ 18. ఆర్ఎస్పీ 19. ఫార్వర్డ్ బ్లాక్ 20. ఎండీఎంకే 21. వీసీకే 22. కేఎండీకే 23. ఎంఎంకే 24. ఐయూఎంఎల్ 25. కేరళ కాంగ్రెస్ (ఎం) 26. కేరళ కాంగ్రెస్ (జోసెఫ్)
National Democratic Alliance: ఎన్డీయే కూటమిలోని పార్టీలు
ఈ కూటమిలో మొత్తం 38 పార్టీలున్నాయని బీజేపీ చెబుతోంది. అవి
- బీజేపీ 2. జనసేన 3. శివసేన (షిండే వర్గం) 4. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) 5. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (పశుపతి కుమార్ పారస్ వర్గం) 6. ఏఐడీఎంకే 7. అప్నాదళ్ (సోనేలాల్) 8. నేషనల్ పీపుల్స్ పార్టీ 9. ఆల్ జార్ఖండ్ స్టుడెంట్స్ యూనియన్ 10. సిక్కిం క్రాంతికారి మోర్చా 11. మిజో నేషనల్ ఫ్రంట్ 12. ఇండిజనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర 13. నాగా పీపుల్స్ ఫ్రంట్ 14. ఆర్పీఐ (అథవాలే) 15. అస్సాం గణ పరిషత్ 16. పీఎంకే 17. తమిళ మనిల కాంగ్రెస్ 18. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 19. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 20. శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) 21. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 22. జననాయక్ జనతా పార్టీ 23. ప్రహార్ జనశక్తి పార్టీ 24. రాష్ట్రీయ సమాజ్ పక్ష 25. జన సూర్యశక్తి పార్టీ 26. కుకి పీపుల్స్ అలయన్స్ 27. యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ (మెఘాలయ) 28. హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ 29. నిషాద్ పార్టీ 30. ఆల్ ఇండియా ఎన్ఆర్ పార్టీ 31. హెచ్ఏఎం 32. శిరోమణి అకాలీదళ్ 33. హరియాణా లోకహిత్ పార్టీ 34. భారత్ ధర్మ జన సేన 35. కేరళ కామరాజ్ కాంగ్రెస్ 36. పుతియ తమిళగమ్ 37. లోక్ జన శక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) 38. గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్.