Lok sabha elections 2024 : ఆసుపత్రి నుంచి వచ్చి ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి!
Lok Sabha Election 2024: అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. ఆసుపత్రి నుంచి ఓటు వేయడానికి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2024 Lok Sabha Elections Phase 2 live updates : 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. మొత్తం 88 సీట్లకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. బెంగళూరులో చాలా మంది ప్రముఖులు.. ఉదయాన్నే వచ్చి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి కూడా ఓటు వేశారు. అయితే.. నారాయణ మూర్తి,ఆసుపత్రి నుంచి వచ్చి మరీ ఓటు వేశారని.. సుధా మూర్తి చెప్పారు.
బెంగళూరు సౌత్‌లోని జయానగర్‌కు వెళ్లి.. ఉదయాన్నే ఓటు వేశారు నారాయణ మూర్తి, సుధా మూర్తి.
"నారాయణ మూర్తికి ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన్ని డిశ్చార్జ్ చేసి, ఓటింగ్ కోసం తీసుకొచ్చాము. ఇప్పుడు ఇంటికి వెళుతున్నాము," అని.. ఓటు వేసిన అనంతరం మీడియాతో చెప్పారు సుధా మూర్తి.
Narayana Murthi 2024 Lok Sabha Elections : తనకి కూడా ట్రావెలింగ్ ప్లాన్స్ ఉన్నాయని, కానీ ముందు ఓటు వేయడానికి వచ్చినట్టు సుధా మూర్తి తెలిపారు.
ఆసుపత్రి నుంచి వచ్చి మరీ ఓటు వేసిన 77ఏళ్ల నారాయణ మూర్తిపై ప్రశంసల వర్షం కురిపించారు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్.
"77ఏళ్ల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అందరికి స్ఫూర్తిదాయకం. ఆసుపత్రి అధికారుల నుంచి అనుమతులు తీసుకుని మరీ వచ్చి.. ఓటు వేశారు. భారత్ కోసం, ప్రజల కోసం ఆయన అంకిత భావానికి ఇది నిదర్శనం," అని ట్వీట్ చేశారు కర్ణాటక సీఈఓ.
తాను ఓటు వేయడమే కాదు.. ప్రజలందరు వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు నారాయణ మూర్తి.
Narayana Murthy Sudha Murthy voting : "రాజ్యంగం ఇచ్చిన హక్కును వినియోగించుకునేందుకు 5ఏళ్లకొసారి అవకాశం వస్తుంది. అందుకే.. ఈ రోజు ఎంతో సంతోషకరమైన రోజు. మనమందరం ఎంతో ఉత్సాహంతో ఓటు వేయాల్సిన రోజు ఇది," అని చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి.
కర్ణాటక సౌత్‌లో తేజస్వీ సూర్య బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక కర్ణాటక మొత్తం మీద 14 లోక్‌సభ సీట్లకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 9.2శాతం పోలింగ్ నమోదైంది.
నారాయణ మూర్తి- సుధా మూర్తి సహా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, క్రికెట్ లెజెండ్- టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, నటులు ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు.. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం 88 సీట్లకు పోలింగ్..
2024 Lok Sabha elections : వాస్తవానికి ఈ దఫా పోలింగ్‌లో 89 సీట్లకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్ బేటుల్ నియోజకవర్గం పోలింగ్ని మే 7కు వాయిదా వేశారు. బీఎస్పీ అభ్యర్థి మరణం ఇందుకు కారణం.
కాగా.. మొత్తం 20 రాష్ట్రాల్లో శుక్రవారం ఎన్నికలు జరగుతున్నాయి. వీటిల్లో 14 సీట్లు కర్ణాటకలో, 13 సీట్లు రాజస్థాన్‌లో, 8 సీట్లు ఉత్తర్ ప్రదేశ్‌లో, 8 సీట్లు మహారాష్ట్రలో, 7 సీట్లు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.
ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు..
అసోం 27.43%
బిహార్ 21.68%
ఛత్తీస్‌గఢ్ 35.47%
జమ్ముకశ్మీర్ 26.61%
కర్ణాటక 22.34%
కేరళ 25.61%
మధ్యప్రదేశ్ 28.15%
మహారాష్ట్ర 18.83%
మణిపూర్ 33.22%
రాజస్థాన్ 26.84%
త్రిపుర 36.42%
పశ్చిమ్ బెంగాల్ 31.25%
సంబంధిత కథనం