Latest Job Alert : వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో 6750 ఉద్యోగాలు.. మెదక్‌లో కూడా జాబ్స్.. అప్లై చేయండి
Latest Jobs News : రైల్వే నుంచి నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ వరకు 6750 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇంకా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఎందులో ఉద్యోగాలు ఉన్నాయో ఇక్కడ చూడండి.
నిరుద్యోగుల కోసం చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రైల్వేతోపాటుగా ఇతర రంగాల్లో వెకెన్సీలకు దరఖాస్తులు కోరుతున్నారు. 6750 పోస్టుల వరకు ఉన్నాయి. మీరు ఇంకా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకపోతే, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ చదవాలి. ఎందులో ఖాళీలు ఉన్నాయో చూద్దాం..
నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ (ఎన్ఆర్ఆర్ఎంఎస్) 4572 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 11 నవంబర్ 2024 నుంచి 28 నవంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్ మెంట్ అధికారిక నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు nrrmsvacancy.in అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ మేనేజర్ సహా పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి avnl.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 30 నవంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 86 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారతదేశంలోని ప్రముఖ కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గెయిల్ ఇండియా మొత్తం 261 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కలలు కనే అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు గెయిల్ అధికారిక వెబ్‌సైట్ gailonline.com ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 12 నుండి ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ 11 డిసెంబర్ 2024గా ఉంది.
రైల్వేలో ఉద్యోగం పొందడానికి సువర్ణావకాశం వచ్చింది. ఆర్ఆర్సీ జైపూర్ 1791 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు rrcjaipur.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 10 నవంబర్ 2024 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2024.
రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నాట్స్ అధికారిక వెబ్సైట్ nats.education.gov.in వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 40 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 నవంబర్ 2024గా ఉంది.