Palnadu Jobs : పల్నాడు జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్- డిసెంబర్ 2 ఆఖరు తేదీ
Palnadu Jobs : పల్నాడు జిల్లా పరిధిలో మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ ఆఖరు తేదీగా నిర్ణయించారు.
పల్నాడు జిల్లాలోని మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీసీ), స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ఏఏ), చిల్డ్రన్ హోమ్ (పిడుగురాళ్ల)లో ఖాళీగా ఉన్న 8 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పనితీరు ఆధారంగా వారి సర్వీసును కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇందులో అర్హులైన స్థానిక అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం జరుపుతారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఉద్యోగులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు. పోస్టు బట్టి ఏడో తరగతి, పదో తరగతి, డిగ్రీ విద్యార్హతతో పాటు అనుభవం అవసరం ఉంటుంది. ఐదు పోస్టులకు కేవలం మహిళు మాత్రమే అర్హులు. మిగిలిన మూడు పోస్టులకు మహిళలు, పురుషులు అర్హలే.
8 పోస్టుల భర్తీ
1. పల్నాడు జిల్లాలో 8 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీసీ)లో మొత్తం మూడు పోస్టులు కాగా, అందులో సోషల్ వర్కర్ -1, అకౌంటెంట్-1, ఔట్‌రీచ్ వర్కర్-1 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మహిళలు, పురుషులు దరఖస్తు చేసుకోవచ్చు. ఈపోస్టులను కాంట్రాక్ట్ పద్ధతి ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
2. చిల్డ్రన్ హోమ్స్ (పిడుగురాళ్ల)లో హౌస్ కీపర్- 1 పోస్టు ఉంది. ఈ పోస్టుకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టు ఔట్ సోర్సింగ్ పద్ధతి ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
3. స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ఏఏ)లో మొత్తం నాలుగు పోస్టులు భర్తీ చేస్తారు. అన్ని ఆయా పోస్టులే. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
వేతనం...వయో పరిమితి
సోషల్ వర్కర్, అకౌంటెంట్ పోస్టులకు రూ.18,536, ఔట్‌రీచ్ వర్కర్‌కు రూ.10,592 వేతనం ఉంటుంది. హౌస్ కీపర్, ఆయాలకు వేతనం రూ.7,944 ఉంటుంది.
1. సోషల్ వర్కర్, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 23 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఔట్‌రీచ్ వర్కర్ పోస్టుకు దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
2. హౌస్ కీపర్ పోస్టుకు దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
3. ఆయా పోస్టులకు దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
4. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు కూడా వర్తిస్తుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3e4da3b7fbbce2345d7772b0674a318d5/uploads/2024/11/2024111495.pdf ను క్లిక్ చేయండి. అలాగే అప్లికేషన్ డౌన్‌లోడ్ కోసం ఈ లింక్ https://cdn.s3waas.gov.in/s3e4da3b7fbbce2345d7772b0674a318d5/uploads/2024/11/2024111424.pdf ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఖాళీలను పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి, డిసెంబర్ 2 తేదీ, సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి, చాకిరాల మిట్ట, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా, పిన్‌కోడ్-522601కి అందజేయాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు