తెలుగు న్యూస్ / ఫోటో /
Charlapally Railway Station : ఇక రయ్... రయ్..! ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి రైల్వే స్టేషన్, ఈ ఫొటోలు చూడండి
- SCR Charlapally Railway Terminal : ఆధునాతన సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులో రానుంది. త్వరలోనే ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ‘X’లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
- SCR Charlapally Railway Terminal : ఆధునాతన సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులో రానుంది. త్వరలోనే ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ‘X’లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
(1 / 6)
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరాలను పేర్కొన్నారు. ఓపెనింగ్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆధునీకణతో ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని అధికారులు చెబుతున్నారు.
(2 / 6)
ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయితే… హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
(3 / 6)
మొత్తం రూ. 428 కోట్లతో ఈ స్టేషన్ ను అభివృద్ధి చేసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఐదు లిఫ్ట్ లు, ఐదు ఎస్కులేటర్లు వీటిలో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
(4 / 6)
మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు జోడించబడినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు.
(5 / 6)
ప్రస్తుతం పనులన్నీ పూర్తి కావడంతోనే త్వరలోనే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ టెర్మినల్ ప్రారంభం కానుంది
(6 / 6)
అధిక ప్రయాణికుల రాక పోకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమైన ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా మరియు సౌందర్య వంతమైన ముఖ్య ద్వారంతో నిర్మించడం జరిగింది.ఈ స్టేషన్ భవనం లో గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ మరియు మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలకు మరియు పురుషులకు కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్వ్యవస్థ ఏర్పాటు చేయబడింది
ఇతర గ్యాలరీలు