Monsoon Tracker : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. తెలంగాణలో మాత్రం హీట్ వేవ్!
Monsoon Tracker : దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఊపందుకోనుంది. కాగా తెలంగాణలో మాత్రం ఇంకొన్ని రోజుల పాటు హీట్ వేవ్ కొనసాగనుంది!
Monsoon Tracker : దేశంలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది ఐఎండీ (భారత వాతావరణశాఖ). ఈశాన్య భారతం, పశ్చిమ్ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతాల్లో.. రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. కానీ తూర్పు, మధ్య భారతంలో రానున్న 3 రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని, ఆ తర్వాత అవి తగ్గుముఖం పడతాయని పేర్కొంది.
వర్షాలే.. వర్షాలు..
నైరుతి రుతుపవనాల పరిస్థితి మరింత సానుకూలంగా మారిందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 18- 21 మధ్య రుతుపవనలు దక్షిణ ద్వీపకల్పంతో పాటు తూర్పు దిక్కున ఉన్న మరిన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని స్పష్టం చేసింది.
"తాజా పరిస్థితుల్లో రానున్న 5 రోజుల్లో కోంకణ్ తీర ప్రాంతానికి మోస్తారు, తేలికపాటి వర్షాలు పడతాయి. దక్షిణ కోంకణ్‌లో వర్షాల ప్రభావం ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు," అని వాతావరణశాఖ తెలిపింది.
ఇదీ చూడండి:- ఇది బిపర్జాయ్ తుపాను సృష్టించిన విధ్వంసం..!
Southwest monsoon live updates : ఈ నెల 18 వరకు అసోం, మేఘాలయల్లో వర్షాలు విపరీతంగా కురుస్తాయి. అసోంలోని నదులు ఇప్పటికే డేంజర్ మార్క్‌కు సమీపంలో ప్రవహిస్తున్నాయి. 11 జిల్లాల్లోని 34వేల మందిపై వర్షాల ప్రభావం పడింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 4 రోజుల్లో విస్తృతంగా వర్షాలు పడతాయి. ఉత్తరాఖండ్‌లో మాత్రం 19న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.
రాజస్థాన్‌లో శని, ఆదివారాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. సోమవారం సైతం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ్ ఉత్తర ప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్‌లలో 20 వరకు వానలు పడతాయి. దక్షిణ భారతంలో మాత్రం రానున్న నాలుగు రోజుల్లో తేలికపాటు, మోస్తారు వర్షాలే కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షాలు పడతాయి. కాగా కేరళ, తమిళనాడు, దక్షిణ కర్ణాటక, రాయలసీమల్లో 20 వరకు విపరీతమైన వర్షాలు కురుస్తాయి.
హీట్ వేవ్ ఎఫెక్ట్..
ఒడిశా, విదర్భాలో రానున్న 5 రోజులు, పశ్చిమ్ బెంగాల్‌లోని గంగా నది తీర ప్రాంతంలో రానున్న 4 రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్ - యానం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లోని రానున్న 3 రోజుల పాటు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు హీట్ వేవ్ ప్రభావం ఉంటుంది.
బలహీన పడిన బిపర్జాయ్..
Cyclone Biparjoy live updates : గుజరాత్‌ను గడగడలాడించిన బిపర్జాయ్ తుపాను శాంతిస్తోంది! ప్రస్తుతం తుపాను తీవ్రత బలహీనపడిందని. రానున్న 12 గంటల్లో తుపాను మరింత బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది.
సంబంధిత కథనం