Kolkata rape case : భారీ వర్షంలోనూ డాక్టర్ల నిరసనలు- న్యాయం కోసం ఆగని పోరాటం..-kolkata rape case junior doctors slam bjps suvendu continue protest amid rain ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Rape Case : భారీ వర్షంలోనూ డాక్టర్ల నిరసనలు- న్యాయం కోసం ఆగని పోరాటం..

Kolkata rape case : భారీ వర్షంలోనూ డాక్టర్ల నిరసనలు- న్యాయం కోసం ఆగని పోరాటం..

Sharath Chitturi HT Telugu
Sep 14, 2024 10:25 AM IST

Kolkata doctor rape case : కోల్​కతా వైద్యులు వెనకడుగు వేయడం లేదు! వైద్యురాలి హత్య కేసులో న్యాయం జరగాలంటూ, తమ డిమాండ్​లను పరిష్కరించాలని భారీ వర్షాల్లోనూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై రాజకీయాలు చేసేందుకు అంగీకరించమని బీజేపీ, టీఎంసీలకు తేల్చి చెబుతున్నారు.

భారీ వర్షంలోనూ కొనసాగుతున్న నిరసనలు..
భారీ వర్షంలోనూ కొనసాగుతున్న నిరసనలు.. (PTI)

కోల్​కతా వైద్యురాలి రేప్​, హత్య కేసులో న్యాయం జరగాలంటూ పశ్చిమ్​ బెంగాల్​ డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల్లోనూ వారందరు వెనకడుగు వేయకుండా ఆందోళనలు చేపడుతున్నారు. అంతేకాదు, తమ పోరాటాన్ని రాజకీయం చేయబోనివ్వమని తేల్చిచెబుతూ, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారికి తేల్చిచెప్పారు.

అలుపెరగని పోరాటం..

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్​పై 'గో బ్యాక్' అని నినదిస్తున్న వారు జూనియర్ డాక్టర్లు కాదని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలను జూనియర్ డాక్టర్ల బృందం తప్పుబట్టింది. తమ నిరసనను రాజకీయాల కోసం వాడుకోనివ్వబోమని ఆందోళన చేస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. సమీపంలోని బీజేపీ కార్యాలయం నుంచి కొందరు జూనియర్ డాక్టర్లకు మద్దతు లభిస్తోందని పేర్కొంటూ తృణమూల్ కాంగ్రెస్ ఓ వీడియోను విడుదల చేసిన క్రమంలో డాక్టర్లు తమ స్టాండ్​ని మరోమారు స్పష్టం చేశారు.

అగ్నిమిత్ర పాల్ వద్ద 'గో బ్యాక్' అని నినదించిన వారు జూనియర్ డాక్టర్లు కాదంటూ సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఓ వైద్యులు తెలిపారు.

ఆగస్టు 9న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్​కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్న స్వస్తి భవన్ వెలుపల విలేకరుల సమావేశంలో నిరసనకారులు మాట్లాడుతూ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న రోగాలకు రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా పటిష్టమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆసుపత్రుల సందర్శనలను తగ్గించడానికి సమర్థవంతమైన రిఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు కోరారు.

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి లేఖ..

ఆర్​జీ కార్ ఆసుపత్రి ప్రతిష్టంభనలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పశ్చిమ్​ బెంగాల్​లో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

పశ్చిమ్​ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ రాసిన నాలుగు పేజీల లేఖ ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కూడా పంపారు.

మెడికల్ కాలేజీల్లో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని, పశ్చిమ్​ బెంగాల్ మెడికల్ కౌన్సిల్​కి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.

రాష్ట్ర వైద్య మండలిని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డాక్టర్ల సంయుక్త వేదిక, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ చాప్టర్ డిమాండ్ చేశాయి.

విలేకరుల సమావేశంలో జూనియర్ డాక్టర్లు ఐదు డిమాండ్లను పునరుద్ఘాటించారు: ఆర్​జీ కర్ అత్యాచారం, హత్యకు కారణమైన వారిని గుర్తించి అరెస్టు చేయడం, కోల్​కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా, మాజీ ఆర్జి కార్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్​పై క్రమశిక్షణ చర్యలు, ఆరోగ్య కార్యకర్తలకు భద్రతా చర్యలు, రాష్ట్రంలోని ఉన్నత ఆరోగ్య అధికారుల రాజీనామా.

నిరసన స్థలంలో సీసీటీవీ కెమెరాలు..

మరోవైపు కోల్​కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలోని స్వస్థ్య భవన్ వద్ద భారీ వర్షం మధ్య జూనియర్ డాక్టర్లు వరుసగా నాలుగో రోజు కూడా తమ నిరసనను కొనసాగించారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, భద్రతను నిర్ధరించే ప్రయత్నంలో, కోల్​కతా పోలీసులు నిరసన స్థలం, పరిసర ప్రాంతాలలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు.

వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు డెడ్​లైన్ విధించిన తర్వాత కూడా డాక్టర్లు వెనకడుగువేయలేదు. న్యాయం చేయాలని, వైద్య సంస్థల్లో భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమను కలవకపోవడంపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ చర్చలు, అనేక పరిపాలనా సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందున తమ అభ్యర్థన సహేతుకమైనదని వారు వాదించారు.

ఎలక్ట్రానిక్ పరికరాలను సమావేశం వెలుపల వదిలేయాలని కోరడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు తాము ప్రయత్నించామని, అయితే ఆ విషయంలో రాజీ పడలేదని డాక్టర్లలో ఒకరైన అనూప్ ముఖర్జీ మీడియాకు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం