Abortion rights : అబార్షన్​ చట్టాల ‘రద్దు’పై బైడెన్​ పోరాటం- ఆ ఆదేశాలపై సంతకం-joe biden signs executive order on abortion rights in us ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Abortion Rights : అబార్షన్​ చట్టాల ‘రద్దు’పై బైడెన్​ పోరాటం- ఆ ఆదేశాలపై సంతకం

Abortion rights : అబార్షన్​ చట్టాల ‘రద్దు’పై బైడెన్​ పోరాటం- ఆ ఆదేశాలపై సంతకం

Sharath Chitturi HT Telugu
Jul 09, 2022 07:56 AM IST

Abortion rights in US: అమెరికాలో అబార్షన్​ చట్టాల రద్దుపై జో బైడెన్​ పోరాడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా.. కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.

<p>అబార్షన్​ చట్టాల ‘రద్దు’పై బైడెన్​ పోరాటం</p>
అబార్షన్​ చట్టాల ‘రద్దు’పై బైడెన్​ పోరాటం (REUTERS)

Abortion rights in US: అబార్షన్​ చట్టాల రద్దుపై సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు.. మహిళకు సాయం చేసేందుకు శుక్రవారం కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. సుప్రీంకోర్టులో రాజకీయాలు నడుస్తున్నాయని, దేశ ప్రయోజనాల కోసం కృషి చేయడం లేదని మండిపడ్డారు బైడెన్​.

దాదాపు 50ఏళ్లుగా ఉన్న అబార్షన్​ చట్టాలను రద్దు చేస్తూ గత నెలలో సంచలన తీర్పును వెలువరించింది అమెరికా సుప్రీంకోర్టు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. అబార్షన్​ అనేది తమ హక్కు అని మహిళలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. వీరికి సెలబ్రిటీలు సైతం మద్దతు పలికారు. తీర్పు వెలువరించిన సమయంలోనే అబార్షన్​ చట్టాల రద్దును బైడెన్​ తప్పుబట్టారు.

కాగా.. రోజులు గడుస్తున్నా ఈ వ్యవహారంపై బైడెన్​ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సొంత పార్టీ సభ్యుల నుంచే ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే అబార్షన్​ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా తాజా ఆదేశాలపై బైడెన్​ సంతకం చేశారు. తాజా ఆదేశాల ప్రకారం.. మహిళలు అబార్షన్​ చేయించుకోవచ్చు. కాంట్రాసెప్షన్​ కూడా వారికి అందుతుంది. అత్యవసర వైద్య సదుపాయాలు అందుతాయి. క్లినిక్స్​ కూడా అందుబాటులో ఉంటాయి. అబార్షన్​ చేయించుకునే మహిళల సమాచారం గోప్యంగా ఉంచుతారు.

Abortion laws in US : "ఒహాయోలో 10ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమెకు అబార్షన్​ చేసుకునే హక్కు లేదు. గర్భం తీసేసేందుకు ఒహాయో నుంచి ఇండియానాకు ప్రయాణించాల్సి వచ్చింది. ఆ చిన్న పిల్ల స్థానంలో మనం ఉంటే? ఊహించడానికే భయంగా ఉంది. రిపబ్లికెన్లు.. సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని దేశంలో వేర్పాటువాద భావాలు పెంచుతున్నారు. కానీ వారికి అమెరికా మహిళల బలం గురించి సరిగ్గా తెలియదు," అని జో బైడెన్​ అన్నారు.

ప్రభావం తక్కువే..!

కాగా.. అబార్షన్​ చట్టాలకు వ్యతిరేకంగా జో బైడెన్​ తీసుకొచ్చిన ఆదేశాలు ప్రభావం చాలా తక్కువే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధ్యక్షుడికి పెద్దగా అధికారాలు లేవు! చట్టాలను రూపొందించే విషయంలో అధ్యక్షుడి కన్నా అమెరికాలోని రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అందుకే.. 'బైడెన్​ ఆదేశాలతో ఎలాంటి మార్పులు వస్తాయి?' అన్న మీడియా ప్రశ్నలకు శ్వేతసౌధం సరైన సమాధం ఇవ్వలేదు. 'సుప్రీంకోర్టు తీర్పును అధ్యక్షుడి కార్యనిర్వాహక ఆదేశాలతో మార్చలేము,' అని మాత్రం చెప్పింది.

Joe Biden : కానీ మానవ హక్కుల సంఘాలు, ప్రజలు బైడెన్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది తొలి అడుగు అని, చట్టాలను మార్చేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని పిలుపునిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్