JEE Advanced 2024 AAT : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఏఏటీ రిజిస్ట్రేషన్​ షురూ..-jee advanced 2024 aat registration window opens check all details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2024 Aat : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఏఏటీ రిజిస్ట్రేషన్​ షురూ..

JEE Advanced 2024 AAT : జేఈఈ అడ్వాన్స్​డ్​ ఏఏటీ రిజిస్ట్రేషన్​ షురూ..

Sharath Chitturi HT Telugu
Jun 09, 2024 05:20 PM IST

జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రిజిస్ట్రేషన్ విండోను ఐఐటీ మద్రాస్ jeeadv.ac.in తెరిచింది. జూన్ 10న సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.

జేఈఈ అడ్వాన్స్​డ్​ ఏఏటీ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం..
జేఈఈ అడ్వాన్స్​డ్​ ఏఏటీ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. (HT)

JEE Advanced AAT 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్ 2024 ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రిజిస్ట్రేషన్ విండోను ఐఐటీ మద్రాస్ ఓపెన్​ చేసింది. jeeadv.ac.in లో ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 10న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, జేఈఈ అడ్వాన్స్​డ్ 2024 ఏఏటీ జూన్ 12న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని నోటిఫికేషన్​లో పేర్కొంది.

ఐఐటీ (బీహెచ్​యూ) వారణాసి, ఐఐటీ ఖరగ్​పూర్​, ఐఐటీ రూర్కీలో మాత్రమే అందుబాటులో ఉన్న బీఆర్క్ (ఆర్కిటెక్చర్) ప్రోగ్రామ్​లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ జేఈఈ అడ్వాన్స్​డ్ 2024 ఏఏటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఏఏటీ 2024: అర్హత..

JEE Advanced AAT eligibility : నోటిఫికేషన్ ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్​డ్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఏఏటీ 2024కు హాజరు కావడానికి అర్హులు.

జేఈఈ అడ్వాన్స్ డ్​ఏఏటీ 2024: ఇలా అప్లై చేసుకోండి..

  • అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.
  • హోమ్ పేజీలోఅందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఏఏటీ రిజిస్ట్రేషన్ లింక్​పై క్లిక్ చేయండి.
  • JEE Advanced AAT syllabus : కొత్త విండో ఓపెన్ అవుతుంది; జేఈఈ అడ్వాన్స్​డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
  • లాగిన్ పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు ఫారం స్క్రీన్​పై కనిపిస్తుంది.
  • జేఈఈ అడ్వాన్స్​డ్ ఏఏటీ 2024 దరఖాస్తు ఫారంనింపండి.
  • సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
  • కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఏఏటీ 2024: అడ్మిట్ కార్డు..

ఏఏటీకి ప్రత్యేక అడ్మిట్ కార్డును జారీ చేయడం జరగదు. జేఈఈ అడ్వాన్స్​డ్ 2024 అడ్మిట్ కార్డును ప్రింట్ తీసి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుతో పాటు ఏఏటీ పరీక్ష హాల్లో సమర్పించాలి.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఏఏటీ 2024: ముఖ్యమైన తేదీలు..

JEE Advanced AAT registration : ఏఏటీ 2024 కోసం ఆన్​లైన్ రిజిస్ట్రేషన్: జూన్ 09, 2024 (10:00 భారత కాలమానం ప్రకారం) నుంచి జూన్ 10, 2024 (17:00 భారత కాలమానం ప్రకారం) వరకు.

ఏఏటీ 2024 పరీక్ష తేదీ: జూన్ 12, 2024 (ఉదయం 09:00 నుంచి 12:00 వరకు).

ఫలితాలను జూన్​ 14న విడుదల చేస్తారు.

జేఈఈ అడ్వాన్స్ డ్ ఏఏటీ 2024 పరీక్షను కేవలం ఏడు ఐఐటీల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గౌహతి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-భువనేశ్వర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-రూర్కీ.

ఈ పరీక్షలో ఒక మూడు గంటల పేపర్ ఉంటుంది. ఏఏటీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్​లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు చెక్​ చేసుకున్నారా?

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024 ఫలితాలను ఆదివారం విడుదల చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్. పరీక్షకు హాజరైన అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్​డ్ అధికారిక వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా అధికారిక వెబ్సైట్ కోరిన సమాచారం వంటి లాగిన్ వివరాలను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం