Cyclone Michaung : మిచౌంగ్​ తుపాను ధాటికి 8మంది బలి! అల్లకల్లోలంగా చెన్నై..-eight dead as cyclone michaung batters indias southeast coast ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclone Michaung : మిచౌంగ్​ తుపాను ధాటికి 8మంది బలి! అల్లకల్లోలంగా చెన్నై..

Cyclone Michaung : మిచౌంగ్​ తుపాను ధాటికి 8మంది బలి! అల్లకల్లోలంగా చెన్నై..

Sharath Chitturi HT Telugu
Dec 05, 2023 12:52 PM IST

Cyclone Michaung live updates : మిచౌంగ్​ తుపాను కారణంగా చెన్నై అల్లకల్లోలంగా మారింది. తమిళనాడు రాజధానిలో ఇప్పటికే 8మంది మరణించారు.

చెన్నైలో పరిస్థితి ఇలా..
చెన్నైలో పరిస్థితి ఇలా.. (AP)

Cyclone Michaung latest updates : ఆంధ్రప్రదేశ్​వైపు దూసుకొస్తున్న మిచౌంగ్​ తుపాను.. తమిళనాడులో అల్లకల్లోలం సృష్టించింది. మరీ ముఖ్యంగా చెన్నైలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. తుపాను ధాటికి.. తమిళనాడు రాజధానిలో ఎనిమిది మంది మరణించినట్టు తెలుస్తోంది.

మిచౌంగ్​ తుపాను బీభత్సం..

మిచౌంగ్​ తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 100కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అయితే.. తీరం దాటిన తర్వాత, సాయంత్రం నాటికి తుపాను శక్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Cyclone Michaung Chennai updates : ఇక చెన్నైలో మిచౌంగ్​ తుపాను ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం, అక్కడ వానలు కాస్త తగ్గుముఖం పట్టినా, గడిచిన 48 గంటల్లో ఒక విధ్వసమే చోటుచేసుకుందని చెప్పుకోవాలి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వీధుల్లో మొసళ్లు కూడా తిరిగాయి. కాగా.. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది.

"ఇటీవలి కాలంలోనే అతి భయానక తుపానును మనం ఎదుర్కొంటున్నాము. జాగ్రత్తగా ఉండాలి," అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ వెల్లడించారు.

Cyclone Michaung latest news : చెన్నైలో మంగళవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు పోలీసులు వెల్లడించారు. చెట్టు కూలి ఓ వ్యక్తి మరణించగా.. మరో వ్యక్తికి విద్యుత్​ షాక్​ కొట్టి ప్రాణాలు కోల్పోయారు. గోడ కూలిన ఘటనలో ఒకరు మరణించారు. ఇంకొందరు నీటిలో మునిగిపోయారు.

చెన్నైలోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా దాదాపు ఒకటిన్నర రోజుల పాటు మూతపడిన చెన్నై విమానాశ్రయం.. మంగళవారం తెరుచుకుంది. కానీ.. ఈ మధ్యలో వేలాది ఫ్లైట్స్​ రద్దు అవ్వడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్క ఇండిగో సంస్థే.. 550 ఫ్లైట్స్​ని రద్దు చేసింది. మంగళవారం సేవలు మొదలైనప్పటికీ.. మరో 60 విమాన సేవలను నిలిపివేసింది ఇండిగో.

ఆంధ్రప్రదేశ్​లో కూడా..!

Cyclone Michaung landfall news : ఏపీలో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. చెట్టు విరిగి కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం వద్ద బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ పై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో 2004 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ సత్యకుమార్ మృతి చెందారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం