Cyclone Michaung in Chennai | జలదిగ్బంధంలో చెన్నై నగరం.. ప్రజలకు తప్పని తిప్పలు-heavy flood water in chennai city due to cyclone michoung ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cyclone Michaung In Chennai | జలదిగ్బంధంలో చెన్నై నగరం.. ప్రజలకు తప్పని తిప్పలు

Cyclone Michaung in Chennai | జలదిగ్బంధంలో చెన్నై నగరం.. ప్రజలకు తప్పని తిప్పలు

Dec 05, 2023 11:45 AM IST Muvva Krishnama Naidu
Dec 05, 2023 11:45 AM IST

  • మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమైంది. సోమవారం రాత్రి వరకు నిరాటంకంగా వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరంలో ఏ కాలువ చూసిన ఒక నదిలా ప్రవహిస్తోంది. ఈ వరద నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిత్యవసర వస్తువులు తెచ్చుకునేందుకు కూడా ఏ ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పండింది. టీనగర్‌, కోడంబాకం, లింగంబాకం, ప్యారిస్‌, మైలాపూర్‌ తదితర ప్రధాన ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇక శివారు ప్రాంతాల్లో నడుము లోతుకుపైగా వర్షం నీరు ప్రవహిస్తోంది. ఇళ్లలోకీ నీరు చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం తిరువళ్లూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది.

More