Canada visa: స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేసిన కెనడా; ఇండియన్ స్టూడెంట్స్ కు నష్టమేనా?-canada ends student visa program how will it impact indian students ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Canada Visa: స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేసిన కెనడా; ఇండియన్ స్టూడెంట్స్ కు నష్టమేనా?

Canada visa: స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేసిన కెనడా; ఇండియన్ స్టూడెంట్స్ కు నష్టమేనా?

Sudarshan V HT Telugu
Nov 09, 2024 04:11 PM IST

విదేశీ విద్యార్థులకు సులభంగా స్టూడెంట్ వీసా అందించే స్టూడెంట్ వీసా ప్రొగ్రామ్ ను రద్దు చేయాలని కెనడా నిర్ణయించింది. స్థానికంగా నెలకొన్న గృహ, వనరుల సమస్యలను పరిష్కరించడం కోసం అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ వీసా కార్యక్రమాన్ని నిలిపిస్తున్నట్లు ప్రకటించింది.

స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేసిన కెనడా
స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేసిన కెనడా (AP)

అంతర్జాతీయ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) వీసా ప్రోగ్రామ్ ను నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దేశంలో నెలకొన్న గృహనిర్మాణం, వనరుల సంక్షోభం నేపథ్యంలో కెనడా ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులందరికీ సమానమైన, న్యాయమైన అవకాశాలను కల్పించడం కోసం ఈ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు కెనడా తెలిపింది.

2018 నుంచి..

అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్ దరఖాస్తులను వేగవంతం చేయడానికి ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (IRCC) 2018 లో ఈ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్డీఎస్) వీసా ప్రోగ్రామ్ ను అమలు చేయడం ప్రారంభించింది. ఈ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) వీసా ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇండియా తో పాటు, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బ్రెజిల్, చైనా, కొలంబియా, కోస్టారికా, మొరాకో, పాకిస్తాన్, పెరూ, ఫిలిప్పీన్స్, సెనెగల్, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వియత్నాం వంటి 14 దేశాల నుండి విద్యార్థులకు వేగంగా, సులభంగా స్టడీ వీసాలను అందించడంపై దృష్టి సారించింది.

అందరికీ సమాన అవకాశం..

‘‘అంతర్జాతీయ విద్యార్థులందరికీ సమానమైన, న్యాయమైన అవకాశాలను ఇవ్వడానికి కెనడా కట్టుబడి ఉంది’’ అని అధికారిక వెబ్సైట్ పేర్కొంది. ‘‘నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చిన దరఖాస్తులన్నీ ఈ పథకం కింద ప్రాసెస్ చేయబడతాయి. ఈ గడువు తర్వాత పంపిన అన్ని దరఖాస్తులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ కింద ప్రాసెస్ చేయబడతాయి’’ అని వివరించింది. ఈ నిర్ణయం ఎస్డీఎస్ అందించే దేశం నుండి స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారి అర్హతను ప్రతికూలంగా ప్రభావితం చేయదని ఆ నోటీసులో పేర్కొన్నారు.

స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ నిలిపివేయడం అంటే ఏమిటి?

స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ కొన్ని దేశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ స్ట్రీమ్ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు స్టడీ వీసా తొందరగా, సులభంగా లభిస్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్ నిలిపివేసిన నేపథ్యంలో భారత్ సహా పైన పేర్కొన్న 14 దేశాలకు చెందిన విద్యార్థులు ఇకపై మరింత సుదీర్ఘమైన వీసా (Visa) ప్రక్రియలకు హాజరు కావాల్సి ఉంటుంది. కెనడా దేశంలోకి ప్రవేశించే వలసదారుల సంఖ్యను నియంత్రించే చర్యగా ఇన్నేళ్లలో మొదటిసారిగా ఈ కఠినమైన విధాన మార్పులు వచ్చాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దెబ్బతినడం, పెరుగుతున్న జీవన వ్యయం, గృహ సంక్షోభం వంటి ఆర్థిక సమస్యల నేపథ్యంలో కెనడా ఈ తాజా నిర్ణయం తీసుకుంది.

Whats_app_banner