Canada student visa : స్టడీ పర్మిట్ ప్రక్రియలో భారీ మార్పులు చేసిన కెనడా!
Canada student visa : అంతర్జాతీయ విద్యార్థులను మోసాల నుంచి కాపాడేందుకు కెనడా కీలక నిర్ణయాలు తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసింది.
Canada student visa news : తమ దేశానికి వస్తున్న అంతర్జాతీయ విద్యార్థులను మోసాల నుంచి రక్షించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కెనడా. ఇకపై ప్రతి అప్లికెంట్కు చెందిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని పోస్ట్- సెకెండరీ డీఎల్ఐ (డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్)లు ఆమోదించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓ కొత్త వెరిఫికేషన్ ప్రక్రియను తీసుకురానుంది. తాజా మార్పులు.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
"అంతర్జాతీయ విద్యార్థులు.. కెనడాలో చదువుకునేందుకు వస్తున్నారు. కానీ కెనడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ప్రోగ్రామ్‌లో మోసాలు జరుగుతున్నట్టు గుర్తించాము. స్టూడెంట్‌కు వీసా పర్మీట్ ఇచ్చే ముందు, వెరిఫికేషన్ ప్రక్రియలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది," అని ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కెనడా.
ఖలిస్థాన్ విషయంలో ఇండియా- కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు వీసా జారీ ప్రక్రియను నిలిపివేసిన ఇండియా.. ఇటీవలే పునరుద్ధరించింది. ఇండియా ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే.. కెనడా.. తన స్టూడెంట్ వీసా వెరిఫికేషన్ ప్రక్రియలో మార్పులు తీసుకురావడం గమనార్హం.
Canada student program : "మోసాలకు సంబంధించిన దర్యాప్తుల నేపథ్యంలో ఈ ఏడాది.. చాలా మంది విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. కొత్త ప్రాసెస్‌తో ఈ ఇబ్బందులు ఉండవు. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కరెక్ట్‌గా ఉంటే సరిపోతుంది," అని కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ తెలిపారు.
"పోస్ట్ గ్రాడ్జ్యుయేషన్ వర్క్ పర్మిట్‌లో నిబంధనలను మార్చేందుకు ఆలోచిస్తున్నాము. కెనడాలో ఉద్యోగులకు లబ్ధిచేకూరే విధంగా రానున్న రోజుల్లో మార్పులు చేస్తాము," అని కెనడా స్పష్టం చేసింది.
మోసాలు చేస్తున్నారా?
Canada student program reforms : ఇటీవలే.. 700కుపైగా మంది భారతీయ విద్యార్థులకు డిపోర్టేషన్ లెటర్స్ అందించింది కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీ. వీరిలో చాలా మంది పంజాబీలు ఉన్నారు. కెనడా వర్సిటీల్లోకి ప్రవేశించే ముందు.. వీరు ఫేక్ అడ్మిషన్ లెటర్స్ సమర్పించారన్నది ప్రధాన ఆరోపణ.
డిపోర్టేషన్ లెటర్స్ అందుకున్న వారిలో చాలా మంది 2018లో కెనడాకు వెళ్లిన వారు ఉన్నారు. 5ఏళ్ల పాటు విద్యాసంస్థల్లో ఉన్నప్పుడు తమను ఏమీ అనలేదని, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అప్లై చేసినప్పుడే ఇలా ఆరోపణలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం