Haemophilia | చిన్న గాయానికే ఎక్కువ రక్తస్రావం అవుతుందా? నిర్లక్ష్యం వద్దు!
World Haemophilia Day | చిన్న గాయానికే ఎక్కువ రక్తస్రావం అయితే రక్తం గడ్డకట్టని పరిస్థితి ఉంటే అది హీమోఫిలియా అనే రక్తప్రసరణ వ్యవస్థకు చెందిన ఒక వ్యాధి కావొచ్చు. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, నివారణ పద్ధతులను తెలుసుకోండి..
ఏదైనా దెబ్బ తగిలినపుడు రక్తస్రావం అవడం, కొద్దిసేపటికి గడ్డకట్టడం సాధారణమే. అయితే ఆగకుండా రక్తస్రావం జరిగితే అటువంటి పరిస్థితిని హీమోఫిలియా అంటారు. ఇది రక్త ప్రసరణ వ్య్వవస్థకు చెందిన వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించే వ్యాధి. ఇది స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ సంభవిస్తుంది.
హీమోఫిలియా వ్యాధితో బాధపడేవారిలో ఏదైనా గాయం అయినపుడు రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి అవసరమయ్యే ప్రక్రియ సరిగా జరగదు. ఈ వ్యాధి రక్తం గడ్డకట్టించే శరీర సామర్ధ్యాన్ని బలహీనపరుస్తుంది. దీంతో గాయం శరీరం వెలుపలైనా, లోపలైనా రక్తస్రావం కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి వారిలో శరీరం అంతర్లీనంగా కీళ్లలో లేదా మెదడులో రక్తస్రావం జరిగితే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని హీమోఫిలియాకి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.
ఈ రక్త ప్రసరణ వ్య్వవస్థకు చెందిన ఈ జన్యు పరమైన వ్యాధికి సంబంధించి మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17న 'ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం' గా పాటిస్తున్నారు.
హీమోఫిలియా ఎలా బయటపడుతుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
- ఏదైనా గాయం అయినపుడు నిరంతరాయంగా రక్తం కారుతూ ఉంటే అది హీమోఫిలియా కావొచ్చు.
- అప్పుడప్పుడు బ్రష్ చేసుకునేటపుడు లేదా దంత సమస్యలు ఏర్పడినపుడు తరచుగా నోటి నుంచి రక్తాన్ని గమనించినపుడు.
- టీకా వేసినపుడు లేదా చిన్న సూది కుచ్చినపుడు ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు వచ్చినపుడు.
- కీళ్లు, కండరాల్లో నొప్పి, వాపు.
- అప్పుడప్పుడు మలంలో ఎక్కువ మొత్తంలో రక్తం రావడం.
- పై లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని అది హీమోఫిలియానా లేక సాధారణమైన రక్త స్రావమా అనేది నిర్ధారించుకోవాలి.
ఎలా నివారించవచ్చు?
ప్రస్తుతం హీమోఫిలియాకి ఫిజికల్ థెరపీ, ఫైబ్రిన్ సీలాంట్స్, డెస్మోప్రెసిన్ మొదలైన చికిత్సా విధానాలను అనుసరిస్తున్నారు.
అయితే హీమోఫిలియా కలిగిన వారు దెబ్బతగిలించుకోకుండా ఎల్లప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.
మంచి ఆహారం, రోగ నిరోధక శక్తిని పెంచే యోగా లాంటి వ్యాయామాలు చేయడం ద్వారా ఈ వ్యాధిని కట్టడి చేయవచ్చు.
సంబంధిత కథనం