Childhood Cancer Day : పిల్లలలో క్యాన్సర్ లక్షణాలను తల్లిదండ్రులు ఇలా తెలుసుకోవాలి-world childhood cancer day 2023 possible signs and symptoms of cancer in children here s tips for parents ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Childhood Cancer Day : పిల్లలలో క్యాన్సర్ లక్షణాలను తల్లిదండ్రులు ఇలా తెలుసుకోవాలి

Childhood Cancer Day : పిల్లలలో క్యాన్సర్ లక్షణాలను తల్లిదండ్రులు ఇలా తెలుసుకోవాలి

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 08:23 PM IST

పిల్లలకు చిన్నపాటటి జ్వరం అంటేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది క్యాన్సర్ అంటే.. తల్లడిల్లిపోతారు. క్యాన్సర్ అంటే ఏంటో తెలియని చిన్నతనంతో కొంతమంది పిల్లలు ఆ మహమ్మారితో పోరాటం చేయాల్సి వస్తుంది. అయితే వారిలో క్యాన్సర్ లక్షణాలను ముందుగానే తల్లిదండ్రులు గుర్తించొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

అనేక వ్యాధులను అదుపుచేయటంలో గణనీయమైన విజయం సాధించిన ఇండియా ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న కాన్సర్ల(Cancer) నుంచి సవాలు ఎదుర్కొంటున్నది. భారతదేశంలో ఏటా 50,000 మంది పిల్లలు వివిధ రకాల కాన్సర్లతో బాధపడుతున్నారు. ఇతర దేశాల్లో 80-90 శాతం మంది పిల్లలు క్యాన్సర్(Cancer In Children)ను జయిస్తే, భారతదేశంలో మాత్రం దీని విలువ 60 శాతం వరకే చేరుకోగలుగుతుంది. రోగనిర్ధారణలో ఆలస్యం కావడం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికస్థితి, సామాజిక భావోద్వేగాలకు గురి కావడం వంటివి చికిత్సను మధ్యలోనే వదిలివేయడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రజల్లో ఈ కాన్సర్లపై అవగాహనా కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న ప్రపంచ చిన్నపిల్లల క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 సంవత్సరానికిగాను “క్లోజ్ ది కేర్ గ్యాప్"(Close The Care Gap) నినాదాన్ని ఎంచుకుంది.

14 ఏళ్ల లోపు వచ్చే క్యాన్సర్ ను చైల్డ్ హుడ్ క్యాన్సర్(Childhood Cancer) అని అంటారు. పిల్లల్లో క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించి నయం చేయవచ్చని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం క్యాన్సర్ రకాలు, వాటి లక్షణాలు గురించి తెలుసుకుందాం..

చిన్నపిల్లల క్యాన్సర్ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్ జయంతి మాట్లాడుతూ, 'మీ పిల్లలకు క్యాన్సర్(Cancer) ఉందని సూచించే కొన్ని సాధారణ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో అలసట, తలనొప్పి, కీళ్లనొప్పి, వాపు, జ్వరం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం, మెడ లేదా చంకలలో వాపు లేదా శోషరస కణుపులు, సులభంగా గాయపడటం, రక్తస్రావం వంటివి ముఖ్య లక్షణాలు. వీటిలో ఏవైనా ఉన్నట్లయితే, వీలైనంత త్వరగా పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ నుంచి వైద్య సలహా పొందడం చాలా అవసరం' అని తెలిపారు.

'చిన్నపిల్లల క్యాన్సర్ గురించి తల్లిదండ్రులు(Parents) తప్పక తెలుసుకోవలసిన విషయాల ఇతరేతర కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్‌లు(Infections), తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు, బరువు తగ్గడం లేదా ఆకలి లేకపోవడం, తలనొప్పి లేదా తట్టుకోలేని జ్వరం వంటివి మీ పిల్లల్లో క్యాన్సర్‌కు కారణాలు కావోచ్చు. తల్లిదండ్రులు వీటిపై అశ్రద్ధ చూపకుండా వీలైనంత త్వరగా వైద్య సలహా తీసుకోవాలి.' అని డాక్టర్ జయంతి అన్నారు.

లుకేమియా, లింఫోమాస్, ప్రాణాంతక ఎపిథీలియల్ నియోప్లాజమ్స్, వెన్నుపాము కణితులు మరియు మూత్రపిండాల కణితులను అత్యంత సాధారణ క్యాన్సర్ రకాలుగా చెప్పవచ్చు. పిల్లలలో కనిపించే ప్రధాన క్యాన్సర్లు లుకేమియా, ఎవింగ్ సార్కోమా వంటి మెదడు/వెన్నెముక కణితులు. పిల్లలలో ఇటీవల గుర్తించబడిన కొత్త రకాల క్యాన్సర్లలో లుకేమియా, లింఫోమా కూడా ఉన్నాయి. శరీరంపై అసాధారణ గడ్డలు, నిరంతర తలనొప్పి లేదా వాంతులు, బరువు తగ్గడం(Weigh Loss) లేదా అలసట వంటివి వారి పిల్లల ఆరోగ్యంలో ఏవైనా మార్పుల గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఈ చిన్నపాటి క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ముందస్తుగా గుర్తించడం కీలకం. తల్లిదండ్రులు ఈ లక్షణాల గుర్తించి అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం అని ఆమె తెలిపారు.

లుకేమియా వంటి రక్త క్యాన్సర్‌లను నిర్ధారించడానికి అనుభవైజ్ఞులైన వైద్యులచేత రోగ నిర్ధారణ కోసం ఎముక మజ్జ పరీక్షలు అవసరం ఉంటాయి. ఎర్ర రక్త కణాల కౌంట్ కొన్ని రకాల చైల్డ్ హూడ్ క్యాన్సర్‌(Childhood Cancer)ని నిర్ధారించడానికి వైద్యులు ఉపయోగించే ముఖ్యమైన సూచికలు. తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న వయస్సు పిల్లల్లో వచ్చే క్యాన్సర్ సంకేతాల గురించి తెలుసుకోవడం, తద్వారా వారు ఏవైనా లక్షణాలు గుర్తించినట్లయితే త్వరగా వైద్య సలహా పొందవచ్చు. ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా వారి జీవితాలను రక్షించవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలలో ఏదైనా అసాధారణ లక్షణాలను గమనించిన వెంటనే, వారు వారి శిశువైద్యునితో సంప్రదించాలి. అవసరమైతే వారిని ఆంకాలజిస్ట్‌కు సూచించవచ్చు.

ఏటా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కంటి క్యాన్సర్ లొ అత్యంత సాధారణ రకం, ఒకేసారి రెండు కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. కంటి చూపులో కనిపించే తెల్లటి మెరుపు వంటి లక్షణాలతో కంటిలోని మార్పులను కలిగి ఉంటాయి. తల్లిదండ్రులు, సంరక్షకులు దృష్టి సమస్యలు లేదా కంట్లో ఎరుపు, వాపు, ఒకటి లేదా రెండు కళ్ళలో నొప్పి వంటివి గమనించినట్లయితే వైద్యున్ని సంప్రదించాలి.