Numb fingers: వేళ్లు మొద్దుబారుతున్నాయా? ఈ 8 కారణాలు అయి ఉండొచ్చంటున్న వైద్యులు-know 7 reasons why you are waking up with numb fingers it may sign of diabetes to stroke ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know 7 Reasons Why You Are Waking Up With Numb Fingers It May Sign Of Diabetes To Stroke

Numb fingers: వేళ్లు మొద్దుబారుతున్నాయా? ఈ 8 కారణాలు అయి ఉండొచ్చంటున్న వైద్యులు

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 12:06 PM IST

Numb fingers: వేళ్లు మొద్దుబారుతున్నట్టయితే దాని వెనక 8 కారణాల్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మీ చేతి వేళ్లు మొద్దుబారిపోవడానికి 8 కారణాలు
మీ చేతి వేళ్లు మొద్దుబారిపోవడానికి 8 కారణాలు (Freepik)

వేళ్లు తిమ్మిరి పడుతున్నాయా? మీరు అర్ధరాత్రి లేదా ఉదయం పూట లేచినప్పుడు మే చేతి వేళ్లు స్పర్శ లేకుండా మారుతున్నట్టయితే అది పలు అనారోగ్యాలకు సంకేతం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అది మీరు పడుకున్న భంగిమ కారణంగా రక్త ప్రసరణ ఆగడం వల్ల అయి ఉండొచ్చు. అది సరిచేసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని అనారోగ్యాలకు సంకేతంగా అనిపించినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్, డయాబెటిక్ న్యూరోపతి, విటమిన్ లోపం, చివరకు గుండె పోటుకు కూడా సంకేతం కావొచ్చు. సంబంధిత 8 కారణాలు ఇక్కడ చూడండి.

1. Carpal tunnel syndrome: కార్పల్ టన్నెల్ సిండ్రోమ్

‘మే చేతిలో ఉండే మధ్య నాడీ కంప్రెస్ అయినప్పుడు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. అంటే మంట, వాపు వంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా వాడకం వల్ల కూడా ఇలా జరగొచ్చు. రాత్రి పూట, లేదా తెల్లవారి లేచినప్పుడు సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. తిమ్మిరెక్కిన చేతులను విదిలించాల్సి వస్తుంది. రాత్రి పూట ఇలా తరచుగా జరగొచ్చు..’ అని భాటియా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ గోసర్ వివరించారు. మధ్య నరం బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలుకు స్పర్శను కల్పిస్తుంది. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చినప్పుడు చేయి, వేళ్లలో తిమ్మిరి, నొప్పి, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. తరచూ కదలికల కారణంగా ఈ సిండ్రోమ్ రావొచ్చు. టైపింగ్, సంగీత పరికరాల వాడకం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ప్రెగ్నెన్సీలో ఇలాంటి సమస్యలు రావొచ్చని బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్యామ్ జైశ్వాల్ వివరించారు.

2. Diabetic neuropathy: డయాబెటిక్ న్యూరోపతి

డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు సగం మంది ఏదో రకంగా నరాలు దెబ్బతిని ఉంటాయి. పెరిఫెరల్ న్యూరోపతి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కూడా కనిపిస్తుంది. ఇవి నొప్పిని, తిమ్మిరిని కలిగిస్తాయి. చేతులు బలహీనంగా మారుతాయి.

3. Sleeping position: నిద్రా భంగిమ

‘మీరు నిద్ర లేచినప్పుడు మీ చేతి వేళ్లు తిమ్మిరికి గురైతే అందుకు మీ నిద్రా భంగిమ కారణం కావొచ్చు. మీ మోచేతులు ముడుచుకుని మీ చేతులపై మీరు పడుకున్నప్పుడు రక్త నాళాలు, నరాలు ఒత్తిడికి గురై మీ చేతి వేళ్లు తిమ్మిరికి, జలదరింపుకు గురి కావొచ్చు. అయితే తాత్కాలిక స్థితి మాత్రమే. మీ చేతులు కదిలించడం వల్ల తిమ్మిర్లు వెళ్లిపోతాయి..’ అని డాక్టర్ జైస్వాల్ వివరించారు.

4. Vitamin B12 Deficiency: విటమిన్ బీ12 లోపం

విటమిన్ బీ 12 లోపం వల్ల మీ పాదాలు, చేతులు, కండరాల్లో తిమ్మిరి, జలదరింపు వస్తుంది. అలాగే మీ కండరాలు బలహీనపడుతాయి. ఆకలి తగ్గుతుంది..’ అని డాక్టర్ గోసర్ వివరించారు.

‘బీ1 (థయామిన్), బీ6(పైరిడాక్సైన్), బీ12 (కోబాలమిన్) విటమిన్ల లోపం వల్ల పెరిఫెరల్ న్యూరోపతి, తిమ్మిరి వస్తుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఈ విటమిన్లు చాలా అవసరం. పోషకాహార లోపం, మద్యం తాగడం, కొన్ని రకాల అనారోగ్యాలు ఇందుకు దారితీస్తాయి..’ అని డాక్టర్ జైస్వాల్ వివరించారు.

5. Stroke: స్ట్రోక్

‘చేతులు మొదుబారిపోవడం స్ట్రోక్‌కు సంకేతం అయి ఉండొచ్చు. ఇతర సంకేతాలతో కూడా స్ట్రోక్ రావొచ్చు. ఇక్కడ స్ట్రోక్ అంటే మెదడులోని భాగాలకు రక్త సరఫరా తగ్గి బ్రెయిన్ డ్యామేజీ అవడం..’ అని డాక్టర్ గోసర్ వివరించారు.

6. Raynaud's disease: రేనాడ్స్ డిసీజ్

చేతివేళ్లు, కాలి వేళ్లకు రక్త సరఫరాపై ప్రభావం చూపడాన్నే రేనాడ్స్ వ్యాధి లక్షణం. తిమ్మిరి, స్ట్రెస్, శీతల వాతావరణంలో చల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా ఇలా జరిగితే అది రేనాడ్స్ డిసీజ్‌గా వైద్యులు నిర్ధారిస్తారు. రేనాడ్స్ వ్యాధి మహిళల్లో సర్వసాధారణం.

7. Peripheral neuropathy: పెరిఫెరల్ న్యూరోపతి

‘పెరిఫెరల్ న్యూరోపతి వేళ్లు, చేతులు సహా అవయవాలను ప్రభావం చేస్తుంది. తిమ్మిరి, జలదరింపు, మంట, నొప్పి వంటి లక్షణాలను చూపుతుంది. పెరిఫెరల్ న్యూరోపతికి చాలా కారణాలు ఉంటాయి. డయాబెటిస్, గాయం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల నరాలు దెబ్బతినడం, కొన్ని విష పదార్థాల బారిన పడడం, నిర్ధిష్ట ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల ఇలా జరుగుతుంది..’ అని డాక్టర్ జైస్వాల్ వివరించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్