గర్భం దాల్చిన ఎన్నో వారంలో తల్లి గొంతును బిడ్డ గ్రహిస్తుంది?
Mother Voice : సృష్టి రహస్యం తల్లి గర్భంలోనే ఉంటుంది. మనిషి పుట్టుక చాలా గొప్పది.. అయితే తల్లి గర్భంలో బిడ్డ ఎదిగే క్రమంలో వివిధ రకాల దశలు ఉంటాయి. అందులో ఒకటి వినికిడి.
తల్లి గర్భంలో శిశువు ఎదుగుదల వివిధ దశల్లో ఉంటుంది. స్త్రీ తన శరీరంలో వచ్చే మార్పులను, బిడ్డ ఎదుగుదలను బాగా గ్రహిస్తుంది. మీరు చాలా సార్లు చూసే ఉంటారు.. నవజాత శిశువులైనా సరే.. తల్లి కాకుండా వేరే వాళ్లు తాకితే వెంటనే ఏడుస్తారు. రోజుల వయసున్న ఆ బిడ్డకు తల్లి స్పర్శ ఎలా తెలుస్తుంది? అంత జ్ఞాపకశక్తి వారికి అప్పుడే ఎలా వస్తుంది? కారణం వాళ్లు కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుంచే తల్లి మాటను, తల్లి స్పర్శను అనుభవిస్తారట. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ. గర్భం దాల్చిన ఎన్నో వారంలో బిడ్డ తల్లి గొంతును గ్రహిస్తుందో తెలుసా..?
గర్భం దాల్చిన 20వ వారంలో, తల్లి గర్భంలో ఉన్న శిశువు చెవి అభివృద్ధి ప్రారంభమవుతుంది. గర్భం 25వ వారంలో, వినికిడి వ్యవస్థ పరిపక్వత చెందుతుంది. పెరుగుదలలో మరింత చురుకుగా ఉన్నప్పుడు, శిశువు మొదట వినడం ప్రారంభిస్తుంది.
బేబీ ఇయర్ డెవలప్‌మెంట్
స్టడీ ప్రకారం, లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రేరేపించబడినప్పుడు, శిశువు 19 వారాలలో 500 హెర్ట్జ్ టోన్‌కు ప్రతిస్పందించగలదట. పిండం పరిపక్వం చెందుతున్నప్పుడు, అన్ని ఫ్రీక్వెన్సీలకు తీవ్రత తగ్గుతుందని అధ్యయనం కనుగొంది. కాలక్రమేణా పిల్లల వినికిడి సున్నితత్వం మారుతుంది.
శిశువు ధ్వనికి ప్రతిస్పందిస్తుంది
కాలక్రమేణా, శిశువు ధ్వనికి మరింత ప్రతిస్పందిస్తుంది. మూడో త్రైమాసికంలో పిండం తల్లి స్వరాన్ని గుర్తించడం, ప్రతిస్పందించడం ప్రారంభమవుతుంది. మీ శిశువు హృదయ స్పందన రేటు పెరుగుతుందనడానికి ఇది ఒక సంకేతంగా మీరు భావించవచ్చు.
పిల్లల వినికిడి అభివృద్ధిలో ఆడిటరీ కార్టెక్స్, టెంపోరల్ కార్టెక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఐదు నుండి ఆరు నెలల కాలం పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈ సమయంలో పిల్లల కార్టెక్స్, టెంపోరల్ లోబ్స్ వివిధ పౌనఃపున్యాల శబ్ధాలతో ట్యూన్ చేయడం ప్రారంభిస్తాయి.
పెద్ద శబ్ధం హాని కలిగించవచ్చు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, శిశువు ఎక్కువ సేపు పెద్ద శబ్దాలకు గురైనట్లయితే, పిండం మొత్తం వినికిడి అభివృద్ధి దెబ్బతింటుందట. 115 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని పిల్లల నుంచి దూరంగా ఉంచాలి. పెద్ద శబ్దాల నుండి రక్షించాలి. పెద్ద శబ్దం శరీరంలో ఒత్తిడి స్థాయిని పెంచుతుంది, ఇది పిల్లల అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అంటే గర్భిణులు ఎక్కువగా శబ్ధాలు ఉన్న ప్రదేశంలో ఉండకూడదు. ఇక్కడ మీకొక ఇంట్రస్టింగ్ విషయం చెప్పాలి.
ఏంటంటే.. మీరు వినే ఉంటారు.. భార్య గర్భం దాల్చితే.. ఆ ఇంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరు, అంటే కొత్తగా ఇళ్లు కట్టుకోవాలన్నా, ఏదైనా మరమ్మతులు చేయాలన్నా డెలివరీ తర్వాతే చేద్దాం అనుకుంటారు. ఇంట్లో స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేయకూడదని ఎప్పటి నుంచో వస్తున్న ఒక నమ్మకం, సైన్స్ పరంగా దీనికి కారణం కూడా శబ్ధాల వల్ల బిడ్డకు హాని జరుగుతుందనే.
టాపిక్