WhatsApp Web: ఇంటర్నెట్​ లేకున్నా వాట్సాప్​ వాడొచ్చు.. ఎలాగో చూడండి!-whatsapp web ,life style న్యూస్
తెలుగు న్యూస్  /  Life Style  /  Whatsapp Web: ఇంటర్​నెట్​ లేకున్నా వాట్సాప్​ వాడొచ్చు.. ఎలాగంటారా!

WhatsApp Web: ఇంటర్నెట్​ లేకున్నా వాట్సాప్​ వాడొచ్చు.. ఎలాగో చూడండి!

Rekulapally Saichand HT Telugu
Nov 15, 2021 01:25 PM IST

ఇప్పటి వరకూ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వాడుతున్నంతసేపూ ఆ ఫోన్ లో నెట్ ఆన్ చేసి ఉండాలి. అప్పుడే మ‌న సందేశాలు అవ‌తలి వ్య‌క్తికి చేరుతాయి. కానీ ఇకపై వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్ వల్ల‌ వాట్సాప్​ వెబ్‌కు ఇంట‌ర్నెట్ అవ‌సరం ఉండ‌దు.

వాట్సాప్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా..
వాట్సాప్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా.. (AP)

ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేసెజింగ్ యాప్ వాట్సాప్ (whatsapp) స‌రికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ల్యాప్​టాప్​, డెస్క్‌టాప్‌ల‌లో వాట్సాప్​ వెబ్ వాడాలంటే QR Codeతో కనెక్ట్ చేసే ఫోన్‌‌లో ఇంట‌ర్నెట్ కచ్చితంగా ఆన్‌‌లో ఉండాలి. అయితే ఈ కొత్త ఫీచర్ వల్ల ఒక్కసారి మీ ఫోన్​తో వాట్సాప్​ వెబ్​ కనెక్ట్​ చేస్తే చాలు ఆ త‌ర్వాత ఫోన్ లో నెట్​​ ఆఫ్ చేసినా చ‌క్క‌గా కంప్యూటర్​లో వాట్సాప్ వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది. 

14 రోజుల త‌ర్వాత‌ ఆటోమేటిక్​గా ​లాగౌట్

దాదాపు 14 రోజుల పాటు ఫోన్ తో సంబంధం లేకుండా నిరాటంకంగా వాట్సాప్​ వెబ్​ వాడేయొచ్చు. సందేశాలు పంప‌డం మాత్ర‌మే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు. ఈ ఫీచర్‌ విండోస్‌ 10, విండోస్‌ 11, మాక్‌ ఓఎస్‌లలో మెరుగ్గా పనిచేస్తుంద‌ని వాట్సాప్‌ తెలిపింది. 14 రోజుల త‌ర్వాత వాట్సాప్‌ వెబ్‌ డెస్క్ టాప్‌లో ఆటోమేటిక్​గా లాగౌట్ అయిపోతుంది. తరువాత క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి వాట్సాప్ వెబ్ యధావిధిగా వాడుకోవాల్సి ఉంటుంది.

ఈ ఫీచ‌ర్‌ను ఎలా ఉపయోగించాలి?

ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్​ యాప్​ను ఓపెన్​ చేసి లింక్డ్​ డివైజెస్ (Linked devices)పై క్లిక్​ చేయండి. ఆ త‌ర్వాత‌ మల్టీ-డివైస్ బీటా (multi-device beta program)పై నొక్కండి. త‌ర్వాత వాట్సాప్​ ఫీచర్​ కు సంబంధించిన వివ‌రాల పేజీ (page) ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జాయిన్​ బీటా (Join Beta)పై క్లిక్​ చేయండి. ఆ తర్వాత “కంటిన్యూ” (Continue) బటన్‌పై నొక్కిన త‌ర్వాత QR Code స్కాన్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌ను వాట్సాప్​ వెబ్‌కి లింక్ చేయండి. అయితే పాత వెర్షన్ యాప్ ను​ ఉపయోగిస్తున్న వారికి ఈ ఫీచర్​ పనిచేయదు. అలాగే ప్రైమరీ ఐఫోన్​ డివైజ్​లలో కూడా ఈ ఫీచర్ పనిచేయదు. 

WhatsApp channel

సంబంధిత కథనం