Cardrona Bra Fence| ఇక్కడ అమ్మాయిలు బ్రా విప్పి వేలాడదీస్తారు.. ఎందుకో తెలుసా?
ప్రపంచంలో ఎన్నో వింతలు. ఎందుకు జరుగుతాయో ఎవరికీ తెలియదు. జరుగుతాయి అంతే. అలాంటిదే ఓ వింత ఆచారం ఉంది. ఇక్కడ అమ్మాయిలు ఒక ప్రదేశంలో తీగపై బ్రాలు వేలాడదీస్తారు. ఇదేంటి అనుకోకండి.. అది అంతే. ఎందుకు అలా చేస్తారో తెలుసా? దాని వెనక బలమైన కారణం కూడా ఉంది.
అసలే ఇది సోషల్ మీడియా కాలం. చిన్న విషయం తెలిస్తే.. చాలు.. ప్రపంచమంతా పాకిపోతుంది. అది ఎలాంటి విషయమైనా సరే.. క్షణాల్లో తెలిసిపోతుంది. ఇటీవలి కాలంలో ఓ సంప్రదాయం కూడా అలానే జనాల్లోకి వెళ్లింది. అమ్మాయిలు బ్రాలు వేలాడదీసే సంప్రదాయం. భారత్ లో మాత్రమే.. కట్టుబట్లు.. అనుకుంటాం.. కానీ కొన్ని దేశాల్లో ఇలాంటి నమ్మకాలు చూస్తే.. ఆశ్యర్యమేస్తుంది. కోరుకున్నది జరుగుతుందా.. జరగదా? అనేది సెకండరీ. కానీ ఎవరి నమ్మకం వారిది. ఇంతకీ ఈ బ్రాలు ఎందుకు వేలాడదీస్తారో చెప్పలేదు కదా.. ఆ కథలోకే వెళ్దాం..
న్యూజిలాండ్‌లో సెంట్రల్ ఒటాగోలో కార్డోనా అనే ప్రాంతం. ఇక్కడకు వేలాదిగా మహిళలు వస్తారు. బ్రా ఫెన్స్ తో ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువ పేరు వచ్చింది. ఇక్కడకు చాలా మంది అమ్మయిలు వస్తారు. వేసుకున్న బ్రా ను తీసి.. ఆ ప్రాంతంలో ఉన్న తీగపై వేలాడదీస్తారు. లేదు.. లేదు.. బ్యాగ్ లో తెచ్చినది .. వేలాడదీస్తారు.. అనుకోకండి.. వేసుకున్నదే తీసి.. తీగపై వేలాడేస్తారు. కార్డోనాకు వచ్చి.. కంచెకు ఎదురుగా నిలుచుంటారు. అనంతరం బ్రా విప్పేసి.. తీగపై వేలాడదీస్తారు.
అలా అని.. ఏదో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుకోకండి. నిత్యం ఇక్కడ ఇదే జరుగుతుంది. ఒక్కప్పుడు న్యూజిలాండ్ లో ఎవరికీ తెలియని ఈ ప్రాంతం.. ఇప్పుడు చాలా ఫేమస్. ఓ పర్యాటక ప్రాంతంగా మారింది.
ఎందుకీ సంప్రదాయం..
అది 1999.. కార్డోనా ప్రాంతం. అక్కడే ఉన్న తీగపై నాలుగు బ్రాలు వేలాడుతూ కనిపించాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. వాటిని ఎవరు వేలాడదీశారనేది మాత్రం తెలియదు. కానీ అక్కడ మాత్రం కనిపించాయి. ఆ తర్వాత.. బ్రాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు వేలాల్లో వేలాడుతూ ఉంటాయి.
ఎందుకు ఇలా చేస్తారు అని అడగ్గా.. ఇక్కడున్న తీగపై బ్రాను వేలాడదీస్తే కోరుకున్న వ్యక్తే జీవిత భాగస్వామి వస్తారని అక్కడి ప్రజల విశ్వాసం అని చెబుతున్నారు. న్యూజిలాండ్ వాళ్లే.. కాదు.. ఈ సంప్రదాయం తెలిసిన విదేశీయులు కూడా ఫాలో అయిపోతున్నారు. ఇదండీ.. తీగపై బ్రాలు వేలాడదీయడానికి వెనకున్న కారణం..
ఇదే ప్రదేశంలో మరో ఆసక్తికర విషయం కూడా జరిగింది. రాత్రి సమయంలో కొంతమంది దొంగలు వచ్చి బ్రాలు చోరీ చేసేవారు. ఇక ఇలాంటి ఘటనలు జరిగాక.. మరింత ఫేమస్ అయిపోయింది ఆ ప్రాంతం. ఎక్కువ మంది అమ్మాయిలు వచ్చి.. మళ్లీ బ్రాలను వేలాడతీయడం మెుదలు పెట్టారు. మెుదట వేలాడదీసే ప్రదేశం నుంచి.. మరో ప్రాంతానికి ఇది మార్చారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి.. వాళ్లకు మంచి జరుగుతుందా లేదా అనేది వేరే విషయం.