Bra alternatives: బ్రా బదులు ఇవి వేసుకోండి.. హుక్స్, స్ట్రాప్స్ ఉండవు.. సౌకర్యమూ రెట్టింపు
Bra alternatives: బ్రా వల్ల సౌకర్యం లేకపోతే దానికి మించిన సౌకర్యాన్నిచ్చే ఇన్నర్ వేర్ రకాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెల్సుకుని మీకు నప్పేది సందర్భానుసారం ఎంచుకోవచ్చు. వాటి పేర్లు, వివరాలు చూసేయండి.
బ్రా వేసుకోవడం వల్ల సౌకర్యంతో పాటూ కొన్ని కష్టాలూ ఉంటాయి. చాలా మంది ఇక తప్పక బ్రా వేసుకుంటారు కానీ దాన్ని వేసుకోడానికి నిజంగా ఇష్టపడరు. హుక్స్ వల్ల, స్ట్రాప్స్ వల్ల సమస్యలుంటాయి. కొంతమందిలో వీటిని వేసుకోవడం వల్ల భుజాలు, మెడలో నొప్పులూ వస్తాయి. అందుకే బ్రాలకు బదులుగా అదే సౌకర్యం, ఛాతీకి మద్దతు ఇచ్చే అనేక ఆప్షన్లు ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే ఎంతో మేలు.
జీరో బ్రా:
దీన్ని రకరకాల పేరుతో పిలుస్తారు. అంటే ఇది వేసుకుంటే బ్రా వేసుకున్నట్లే అనిపించదు. హుక్స్ ఉండవు, కట్స్ ఉండవు, ఎలాస్టిక్ ఉండదు, స్ట్రాప్స్ ఉండవు. ఒక సన్నటి పొర చర్మంలో కలిసిపోయేలా వేసుకున్నట్లు ఉంటుందిది. మైక్రోఫైబర్ నైలాన్ తో వీటిని తయారు చేస్తారు. క్రాప్ టాప్ లాగా వేసుకోవాలి. ఒకరకమైన సీమ్ లెస్ బ్రా అనుకోవచ్చు. దీంతో మంచి కవరేజీ కూడా దొరుకుతుంది.
ఇన్‌బిల్ట్ బ్రా క్యామిసోల్:
క్యామిసోల్ అంటే ఫుల్ పెటికోట్ అనుకోవచ్చు. అయితే వీటికే ఇన్ బిల్ట్ బ్రా కూడా ఉంటుంది. అంటే చాతీ భాగం అంతా బిగుతుగా బ్రా లాగా ఉంటాయి. కింద వైపు కాస్త వదులుగా, సౌకర్యంగా ఉంటాయి. చుడీదార్స్, కుర్తాలు, టీషర్టుల మీదికి కూడా ఈ ఇన్‌బిల్ట్ బ్రా క్యామిసోల్స్ వేసుకోవచ్చు. ప్యాడెడ్ క్యామిసోల్స్ రకాలు కూడా ఇలాగే పనికొస్తాయి.
బ్రాలెట్:
ఈ పేరులో బ్రా అనే అక్షరం ఉన్నా సాధారణ బ్రాకు, బ్రాలెట్‌కు చాలా తేడా ఉంటుంది. తక్కువ చాతీ ఉన్నవాళ్లకి రోజూవారీ ఉపయోగానికి కూడా బ్రాలెట్ మంచి ఎంపిక. బ్రా లాగా కాకుండా దీని వెయిస్ట్ బ్యాండ్ మృదువుగా ఉంటుంది, ప్యాడింగ్ దాదాపుగా ఉండదు, అండర్ వైరింగ్ ఉండదు. అలాగే మంచి డిజైన్లలో అందుబాటులో ఉంటుంది. చెప్పాలంటే ఇది కాస్త క్రాప్ టాప్‌ను పోలి ఉంటుంది. వీటిలో ట్రయాంగిల్ బ్రాలెట్స్ రోజూవారీ వాడకానికి మంచి సౌకర్యాన్ని అందిస్తాయి.
అడెసివ్స్:
అడెసివ్ అంటే అంటుకునేది. ఈ రకమైన బ్రాలు స్లీవ్ లెస్, బ్యాక్ లెస్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు సరిపోతాయి. అలాగే నెట్టెడ్ నెక్ ఉన్న బ్లవుజులు, డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా బ్రా కనిపించకూడదంటే వీటిని వాడొచ్చు. వీటికి స్లీవ్స్, స్ట్రాప్స్, హుక్స్ ఏమీ ఉండవు. రెండు కప్స్ ఉంటాయి. అవి చర్మానికి అతికినట్లే ఉంటాయి. చెమట వచ్చినా ఊడిపోవు. ఇవి చాతీకి మంచి మద్దతు ఇస్తాయి.
ట్యాంక్ టాప్:
డ్రెస్సు కింద మరో డ్రెస్ వేసుకున్నట్లే ఉంటాయివి. కాకపోతే శరీరాన్ని హత్తుకుని బిగుతుగా ఉంటాయి. స్వెట్లర్లు, హై నెక్ డ్రెస్సులు, ట్రాన్స్‌పరెంట్ టాప్స్ మీదకి ట్యాంక్ టాప్ బెస్ట్ చాయిస్. ఇవి కాస్త స్లీవ్ లెస్ టీషర్టు లాగా ఉంటాయనుకోండి. శరీరం మొత్తానికి మంచి కవరేజీ ఇస్తాయి.
బ్రా టేప్:
బ్రా వేసుకోకున్నా మద్దతు రావాలంటే ఈ బ్రా టేప్ వాడొచ్చు. దీన్నే స్టిక్ ఆన్ టేప్, బూబ్ టేప్, బ్రెస్ట్ లిఫ్ట్ టేప్.. ఇలా చాలా రకాల పేర్లున్నాయి దీనికి. పేరు చెబుతున్నట్లే ఇది టేప్ లాగా ఉంటుంది. కాకపోతే అరచేయంత వెడల్పు ఉంటుంది. దీన్ని రొమ్ము కింది వైపు నుంచి పైకి లేపినట్లు మద్దతుగా అతికించుకోవాలి. బ్రాలు లేదా మరేలాంటి ఇన్నర్ వేసుకోలేని దుస్తులకు ఇది మంచి చాయిస్. వీటితో సౌకర్యం కూడా ఉంటుంది. బ్రా వేసుకున్నట్లే అనిపిస్తుంది.
టాపిక్