Wednesday Motivation : మీలోని తప్పులను చెప్పేవాడే నిజమైన స్నేహితుడు
Wednesday Vibes : మీరు ఏం చేయకున్నా.. ఏదో చేసినట్టుగా చెప్పేవాళ్లతో ఎప్పటికైనా ప్రమాదమే. వాళ్లే మీ ఎదుగుదలను ఆపేది. మీలోని లోపాలను చెప్పే శత్రువైనా మీకు స్నేహితుడే అనుకోవాలి.
అన్ని బంధాల కంటే.. గొప్ప బంధం స్నేహం అని చెబుతారు. స్కూల్ వయసు నుంచి చావు వరకూ ఉండే బంధాలలో ఒకటి ఫ్రెండ్ షిప్. అన్నీ ఇంట్లో వాళ్లతో పంచుకోలేం. సో.. స్నేహితులకే కదా చెప్పుకొనేది. అయితే అలాంటి స్నేహితులు.. స్నేహితుడి మంచి కోరాలి. ఫ్రెండ్ ఏది చేసినా.. ఆహా.. ఓహో అనడం తగ్గించాలి. నిజంగా అంత సత్తా ఉంటే పొగిడితే తప్పులేదు. కానీ ఫ్రెండే కదా.. ఓ రెండు మాటలు పొగిడేస్తే.. పోలా అనుకుంటే.. మాత్రం తప్పు. మీ స్నేహితుడిని జీవితంలో మీరే కిందకు లాగేస్తున్నట్టు.
స్నేహానికి వయసుతో సంబంధం లేదు.. అయితే చిన్న నుంచి పెద్ద వరకూ అందరికీ స్నేహితులు ఉంటారు. నా అన్నవారు, బంధువులు లేని వారు ఉంటారేమో.. కానీ స్నేహితులు లేని వారు ఉండరు. జీవితంలో ఏదో సాధించాలనే టైములో మాత్రం.. అండగా ఉండాల్సింది వాళ్లే. ఆ సమయంలో మీరు మీ స్నేహితుడిని ఎలా ప్రభావితం చేస్తున్నారనేది మాత్రం కచ్చితంగా చూసుకోవాలి. మీరు అనే ఒక్క మాటతో వాళ్లు ఆగిపోవచ్చు. లేదంటే.. ఏం చేయకున్నా.. మీరు పొగుడుతుంటే.. నేనే తోపు అనే భావన కలిగి.. మీ స్నేహితుడి అక్కడే ఉండిపోవచ్చు.
మీరు అలసిపోయినప్పుడు మీకు రెక్కలు ఇచ్చేవాళ్లే స్నేహితులు. నువ్వు చేసిన తప్పును నీ ముఖం మీద చెప్పి సరిచేసే వాడే నిజమైన స్నేహితుడు. ఏదైనా మీ స్నేహితుడి వైపు తప్పుఉంటే.. కచ్చితంగా అప్పుడే చెప్పాలి. అలా చెప్పే స్నేహితులు ఉంటే జీవితంలో చాలా సాధించొచ్చు. తప్పును తప్పుగా చెబితే.. స్వీకరించే గుణం కూడా ఫ్రెండుకు ఉండాలి. లేదంటే.. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నట్టు లెక్క.
పొగిడే స్నేహితులు వంద మంది కాదు.. విమర్శించే స్నేహితుడు ఒక్కడైనా ఉండాలి. అలా ఉంటేనే.. మీ తప్పులు మీకు తెలుస్తాయి. మరిన్ని తప్పులు చేయకుండా ఎలా ముందుకు వెళ్లాలో మీకో ఐడియా వస్తుంది. మీరు గెలిచాక ఎవరైనా పొగడతారు. మీరు ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని సరిగా చూసి.. మీ తప్పులను ఎత్తిచూపే ఒక్కరు ఉండాలి. అలాంటి వారి ఉంటేనే.. మీ గురించి మీకు అర్థమవుతుంది.
మీ రహస్యాలను దాచుకునే స్నేహితుడు మీకు ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వేరే వారి దగ్గర పంచుకునేవాళ్లను దగ్గరకు రానివ్వకండి. నీ తప్పు నీతో చెప్పే వాడు స్నేహితుడు, నీ తప్పు ఎదుటివాళ్లతో చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే.. నీ అనుకూల శత్రువు..
సంబంధిత కథనం
టాపిక్