World Expensive Rose : అత్యంత ఖరీదైన గులాబీ పూలు.. వామ్మో.. ధర 130 కోట్లా?-valentines day 2023 juliet rose worlds most expensive rose here s cost ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Expensive Rose : అత్యంత ఖరీదైన గులాబీ పూలు.. వామ్మో.. ధర 130 కోట్లా?

World Expensive Rose : అత్యంత ఖరీదైన గులాబీ పూలు.. వామ్మో.. ధర 130 కోట్లా?

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 09:23 AM IST

Juliet Rose : అసలే ప్రేమికుల నెల ఇది. గులాబీ పువ్వులకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. ధర కూడా పెంచేస్తారు. అయితే.. ప్రపంచలో ఓ గులాబీకి మాత్రం ఎక్కడా లేని ధర ఉంది. కోట్లలో రేటు పలుకుకుతుంది.

జూలియెట్ రోజ్
జూలియెట్ రోజ్ (unsplash)

సాధారణంగా ఫిబ్రవరి నెలలో ఎక్కువ గులాబీ పూలు(Rose Flower) అమ్ముడవుతుంటాయి. అలాగే పూల ధర పెరుగుతుంది. అయితే ప్రపంచంలో ఖరీదైన గులాబీ పూల గురించి మీకు తెలుసా? గులాబీ పువ్వును ప్రేమ సంకేతంగా పరిగణిస్తారు. ఫిబ్రవరి నెల ప్రేమికులకు ప్రత్యేక నెల. సాధారణంగా ఈ నెలల్లో ఎక్కువ గులాబీ పూలు.. మంచి ధరకు అమ్ముతారు. అయితే ప్రపంచంలో భారీ ధర పలికే గులాబీలు ఉన్నాయి. రూ.130 కోట్ల వరకూ ధర పలుకుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా 16 వివిధ రంగుల గులాబీ పూలను మనం చూడొచ్చు. ప్రతి పువ్వుకో ప్రత్యేకత ఉంటుంది. వీటిలో కొన్ని వాసన చూసేందుకు భలే ఉంటాయి. దాదాపు అన్ని అందంగానే కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం జూలియెట్ అనే గులాబీ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా ఉంది. 130 కోట్ల రూపాయల ధర ఉంటుంది.

జూలియెట్ గులాబీ పువ్వు(Juliet Rose) వచ్చేందుకు 15 సంవత్సరాలు పడుతుంది. ఈ గులాబీని అనేక పువ్వులను కలిపి.. డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి.. సృష్టించాడు. 2006లో మెుదటిసారిగా జూలియెట్ గులాబీని ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పుడు 90 కోట్ల రూపాయలకు దీనిని విక్రయించారు. జూలియెట్‌న ధరకు మరొక కారణం కూడా ఉంది. ఈ పువ్వు నుంచి వచ్చే వాసన భలే ఉంటుందట. కొత్తరకమైన పెర్ఫ్యూమ్ సువాసనలా ఉంటుంది. చాలా మంది ఈ సువాసనను ఇష్టపడతారు.

రోమియో, జూలియెట్ ప్రేమకథ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అందుకే ఈ గులాబీకి జూలియెట్ అనే పేరు పెట్టారు. జూలియెట్ గులాబీ ధర ఏడాదికోసారి పెరుగుతోంది.

Whats_app_banner