పసుపుతో ప్రయోజనాలు పొందాలంటే.. ఈ విధంగా ఉపయోగించండి!
ప్రథమ చికిత్స కోసం సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో పసుపు ఒకటి. వేదాలు, పురాణాల నుండి ఆయుర్వేదం వరకు పసుపుకు ఆదిక ప్రాధాన్యత ఉంది. నేటి ఆధునిక జగత్తులో కూడా పసుపును అధికంగా ఉపయోగిస్తున్నారు.
3500 సంవత్సరాలకు పైగా పసుపు వినియోగంలో ఉన్నట్లు అనేక అధ్యయనాల్లో తెలింది. పసుపుకు భారతీయ సంస్కృతి, వంటగదిలో చాలా ప్రాధాన్యత ఉంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, వాపు, గాయం, నొప్పులు నివారణకు పసుపును ఉపయోగిస్తారు. ప్రథమ చికిత్స కోసం సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో పసుపు ఒకటి. వేదాలు, పురాణాల నుండి ఆయుర్వేదం వరకు దీనికి ఆదిక ప్రాధాన్యత ఉంది. నేటి ఆధునిక జగత్తులో పసుపును ఉపయోగిస్తున్నారు. మరీ పసుపుకు ఇంతటి ఆదరణ ఉండటానికి కారణమేంటి? పసుపు ఒక అద్భుతమైన ఔషధం. భారతీయ సాంప్రదాయ మూలికా వైద్యంలో పురాతన కాలం నుండి పసుపు ఉపయోగిస్తున్నారు. 4000పైగా జరిగిన క్లినికల్ అధ్యయనాలలో పసుపు గొప్ప ఔషధం నిరూపించబడింది.
అయితే పసుపులో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా ఉపయోగించని కారణంగా వాటి ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. చాలా మంది మహిళలు రంగు కోసంమని వంటలో పసుపును ఉపయోగిస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పసుపు ఉపయోగాల గురించి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు పుష్కలంగా ఉంటాయి. దాదాపు యాభైపైగా ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పసును ఉపయోగపడుతుంది. కానీ రుచి, రంగును దృష్టిలో ఉంచుకుని పసుపును వంటలలో వాడుతుంటారు. అయితే పసుపు ఉపయోగంలో కొద్దిగా మార్పు చేస్తే, రుచి, రంగుతో పాటు శరీరానికి ఆర్యోగానికి కూడా తోర్పడుతుంది.
పసుపు శరీరానికి సరిగ్గా ఇముడుతుంది. కూరగాయలు లేదా పప్పులను వేయించేటప్పుడు, పాన్‌లో నూనె వేయడానికి కంటే ముందు పసుపును అవసరమైన విధంగా వేసి నూనెలో కరిగించాలి. రోజులో 5-8 గ్రాముల (2 టీస్పూన్లు) పసుపును ఉపయోగించవచ్చు. టీ, పాలు లేదా గ్లాసు నీటిలో అర టీస్పూన్ (2 గ్రాములు) పసుపు, 2 చిటికెల ఎండుమిరియాల పొడి వేసి రోజు తాగాలి. నల్ల మిరియాలతో కలిపి పసుపు తీసుకుంటే శరీరంలో అవసరమయ్యే భాగాలకు ఈజీగా చేరుతుంది. నల్ల మిరియాలు పసుపు జీవ లభ్యతను పెంచుతుంది. సుమారుగా 2000 రెట్లు పెరుగుతుంది.
సంబంధిత కథనం