Natural Wonders: ప్రకృతి సృష్టించిన అద్భుత వింతలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే-top natural phenomena that are a must for your travel bucket list ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Wonders: ప్రకృతి సృష్టించిన అద్భుత వింతలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Natural Wonders: ప్రకృతి సృష్టించిన అద్భుత వింతలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Koutik Pranaya Sree HT Telugu
Jul 19, 2024 01:30 PM IST

Natural Wonders: ప్రకృతి సహజంగా సృష్టించి అద్భుతమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయో, వాటి ప్రత్యేకత ఏంటో చూడండి.

ప్రకృతి సృష్టించిన వింతలు
ప్రకృతి సృష్టించిన వింతలు

ప్రకృతి అంటేనే అందం. ప్రకృతి అంటే అద్భుతం. అందం, అద్భుతం కలబోసేలా ప్రకృతి సృష్టించిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. సహజ పరిణామాల వల్ల ఈ ప్రదేశాల్లో మరెక్కడా లేని వింతలు ఉంటాయి. ఆ ప్రదేశాలేంటో, వింతలేంటో చూడండి. జీవితంలో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందేనట.

అరోరా బొరిలిస్, నార్వే:

ఆకాశంలో రంగులు
ఆకాశంలో రంగులు (Pexels)

ఆకాశంలో ఆకుపచ్చ రంగును పెయింట్ వేసినట్లున్న ఈ ఫొటో ఎడిట్ చేసింది కాదు. ప్రకృతి సృష్టించింది. దీన్ని నార్తర్న్ లైట్ అంటారు. ఆకాశంలో ఆకుపచ్చ, పర్పుల్ రంగుల్లో కాంతులను చూడొచ్చిక్కడ. రంగులు తాండవం చేస్తున్నట్లుంటాయి. ఈ అద్భుతాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు. భూమి అయస్కాంత క్షేత్రం సూర్యుని కణాలతో ఢీ కొనడం వల్ల ఈ రంగుల కాంతి ఏర్పడుతుంది.

బయో లుమినిసెంట్ బీచ్, మాల్దీవ్స్:

మెరిసే బీచ్, మాల్దీవ్స్
మెరిసే బీచ్, మాల్దీవ్స్

తెలుపు రంగు ఇసుక, నీలి రంగు నీళ్లతో మాల్దీవుల్లో బీచులు ఆకర్షణీయంగా ఉంటాయి. సముద్ర ప్రాంతాలు ఇష్టపడే వాళ్లకి మాల్దీవ్స్ మంచి యాత్రా ప్రదేశం. ఇదంతా పగటి పూట ముచ్చట. రాత్రయితే ఈ అందం రెట్టింపు అవుతుంది. మాల్దీవ్స్ లోని రా అటోల్ ప్రాంతానికి వెళ్తే దీన్ని చక్కగా చూడొచ్చు. రాత్రి సముద్ర తీరాలు నీలిరంగు కరెంట్ పురుగులు వాలినట్లు మెరిసిపోతాయి. బయో లుమినిసెన్స్ అనే ప్రక్రియ వల్ల ఈ వింత జరుగుతుంది. ఒక్కసారైనా ఈ వింత చూడాల్సిందే.

రెయిన్ బో మౌంటెన్, పెరూ:

రెయిన్ బో మౌంటెన్స్, పెరూ
రెయిన్ బో మౌంటెన్స్, పెరూ (Pexels)

ప్రకృతి పెయింట్ వేసిన అతిపెద్ద కాన్వాస్ అనుకోవచ్చు వీటిని. పెరూ దేశంలోని రెయిన్ బో పర్వతాలు రంగురంగులతో పెయింట్ వేసినట్లుంటాయి. వీటి మీదున్న మంచు పొర కరిగిన తర్వాత 2013 లో వీటిని కనుగొన్నారు. పర్పుల్, ఆకుపచ్చ, నీలం, పసుపు రంగు రాళ్లతో పెయింట్ వేసినట్లుంటుంది. మినరళ్ల పొరలు పేరుకుపోవడం వల్ల ఈ రంగులు ఏర్పడ్డాయట. ఈ వింత చూడ్డానికి పెరూలోని కూస్కో అనే ప్రదేశానికి వెళ్లాల్సిందే.

డైమండ్ బీచ్, ఐస్ ల్యాండ్:

డైమండ్ బీచ్
డైమండ్ బీచ్ (Pexels)

ఈ డైమండ్ బీచ్ చూస్తే భూమి మీద ఉన్న విషయమే మర్చిపోతాం. ఏదో వింత లోకంలో ఉన్నట్లుంటుంది. నల్లటి ఇసుక మీద తెల్లగా అచ్చం వజ్రాల్లాగా మెరిసే మంచు ముక్కలుంటాయి. వీటికున్న ఆకారం కూడా ప్రత్యేకంగా వజ్రాలనే పోలి ఉంటుంది. ఈ వింతను చూడాలంటే ఐస్ ల్యాండ్ లోని సౌత్ కోస్ట్‌కు వెళ్లాల్సిందే.

వైటోమో గ్లో కేవ్స్, న్యూజిల్యాండ్:

మెరిసే గుహలు
మెరిసే గుహలు (Google Image)

న్యూజిల్యాండ్ లో ఉన్న వైటోమో గ్లో కేవ్స్ ఇంకా ప్రత్యేకమైనవి. ఈ గుహల్లో పై బాగంలో గ్లో వార్మ్ ఉంటాయి. అంటే మెరిసే పురుగులు. వీటివల్ల గుహలు మెరిసిపోతాయి. కింద నీళ్లు ఉండటం వల్ల ఆ మెరుపు మరింత రెట్టింపవుతుంది. ఒక బోట్ రైడ్ లో వీటిని వీక్షిస్తే నెరెల్లబెట్టి చూడాల్సిందే.

 

టాపిక్