Nagarjuna on Maldives: భయం కాదు.. మాల్దీవ్స్ ట్రిప్ అందుకే క్యాన్సిల్ చేసుకున్నా: నాగార్జున-nagarjuna cancels maldives trip says its not fear ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna On Maldives: భయం కాదు.. మాల్దీవ్స్ ట్రిప్ అందుకే క్యాన్సిల్ చేసుకున్నా: నాగార్జున

Nagarjuna on Maldives: భయం కాదు.. మాల్దీవ్స్ ట్రిప్ అందుకే క్యాన్సిల్ చేసుకున్నా: నాగార్జున

Hari Prasad S HT Telugu
Jan 15, 2024 10:17 AM IST

Nagarjuna on Maldives: మాల్దీవ్స్ పై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో తాను టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నట్లు నాగార్జున చెప్పాడు. అయితే అది భయంతో మాత్రం కాదని అతడు అన్నాడు.

అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున

Nagarjuna on Maldives: నా సామిరంగ మూవీతో సంక్రాంతి బరిలో దిగి సక్సెస్ కొట్టిన అక్కినేని నాగార్జున తాజాగా మాల్దీవ్స్ వెర్సెస్ లక్షద్వీప్ రచ్చపై స్పందించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ లతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగార్జున.. తాను వెకేషన్ కోసం బుక్ చేసుకున్న మాల్దీవ్స్ టికెట్లను రద్దు చేసుకున్నట్లు చెప్పాడు.

బిగ్ బాస్, నా సామిరంగ సినిమా షూటింగ్ లతో 75 రోజులుగా తీరిక లేకుండా గడిపానని, అందుకే మూవీ రిలీజ్ కాగానే జనవరి 18న మాల్దీవ్స్ వెళ్లాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు నాగార్జున చెప్పాడు. టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలో నాగ్ ఈ కామెంట్స్ చేశాడు. అయితే భయంతోనో, ఎవరో ఏదో అంటారనో తాను టికెట్లు రద్దు చేసుకోలేదని అన్నాడు.

అందుకే మాల్దీవ్స్ వెళ్లడం లేదు: నాగార్జున

ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ కు వెళ్లి అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేశారో అప్పటి నుంచీ సెలబ్రిటీల రూటు మారింది. దీంతో మాల్దీవ్స్ మంత్రులు మోదీపై నోరు పారేసుకున్నారు. ఇది వాళ్లకు మరింత నష్టం చేస్తూ బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ మొదలైంది. అక్కడి వాళ్లు చేసిన ట్వీట్లు సరి కాదని, అందుకే తాను మాల్దీవ్స్ వెళ్లడం లేదని నాగార్జున స్పష్టం చేశాడు.

"నేను 75 రోజులుగా బిగ్ బాస్, నా సామిరంగ సినిమా కోసం షూటింగ్ చేస్తూనే ఉన్నాను. ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. ఇంట్లో వాళ్లను కూడా పట్టించుకోలేదు. అందుకే జనవరి 18న వెళ్దామని టికెట్లు బుక్ చేసుకున్నాను. కానీ తర్వాత రద్దు చేసుకున్నాను. అది భయమో ఎవరైనా ఏదైనా అంటారనో కాదు. కానీ అక్కడి వాళ్లు చేసిన ట్వీట్లు సరికాదు. 150 కోట్ల మంది ప్రజల ప్రధానిపై వాళ్లు నోరు పారేసుకున్నారు. అది నచ్చకే నేను మాల్దీవ్స్ వెళ్లడం లేదు. అవి రద్దు చేసుకొని మన లక్షద్వీప్ కు వెళ్దామనుకుంటున్నాను" అని నాగార్జున అనడం గమనార్హం.

ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉండాలని, వాళ్లు అన్న మాటలకు ఇప్పుడు పరిణామాలను ఎదుర్కొంటున్నారని నాగ్ అన్నాడు. అంతేకాదు లక్షద్వీప్ దీవులు చాలా బాగుంటాయని కూడా ఈ సందర్భంగా అతడు చెప్పాడు. అక్కడి బంగారం ఐలాండ్స్ గురించి పదేపదే ప్రస్తావించాడు. కీరవాణికి కూడా లక్షదీవులకు వెళ్లాలని సలహా ఇచ్చాడు.

నా సామిరంగ మూవీ ఎలా ఉందంటే?

నా సామిరంగ అంటూ సంక్రాంతి బరిలో దిగిన నాగార్జున మరో హిట్ కొట్టాడు. ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నా సామిరంగ సినిమా కథ కొత్తదేం కాదు. ఇలాంటి కథలు ఇప్పటికీ చాలానే వచ్చాయి. కానీ, నా సామిరంగ సినిమా 1980 కాలం నేపథ్యంలో జరుగుతుంది.

రెండు గ్రామాల మధ్య ఏర్పడిన వైరం, ప్రేమకథ, స్నేహం, అభిమానం వంటి ఎమోషన్లతో కలగలపిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామిరంగ. మలయాళ హిట్ మూవీ పొరింజు మరియం జోస్‌కు రీమేక్ అనగానే నా సామిరంగపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, తెలుగు నెటివిటీకి తగినట్లుగా కథలో మార్పు చేసి సినిమాను తెరకెక్కించారు.

Whats_app_banner