Dal Fry : ఈ దీపావళికి దాల్ ఫ్రై చేయండి.. చాలా టేస్టీగా ఉంటుంది-today recipe how to make dal fry for diwali heres easy way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dal Fry : ఈ దీపావళికి దాల్ ఫ్రై చేయండి.. చాలా టేస్టీగా ఉంటుంది

Dal Fry : ఈ దీపావళికి దాల్ ఫ్రై చేయండి.. చాలా టేస్టీగా ఉంటుంది

Anand Sai HT Telugu
Nov 10, 2023 12:30 PM IST

Dal Fry Recipe : దాల్ ఫ్రై అనేది ఉత్తర భారతంలో ఎక్కువగా చేస్తారు. రోటీ, నాన్‌తో వడ్డిస్తారు. అయితే ఈ దాల్ ఫ్రై మన వేడి అన్నంలోకి బాగుంటుంది. చపాతీకి కూడా మంచి కాంబినేషన్. ఈ దీపావళికి తినేసేయండి.

దాల్ ఫ్రై
దాల్ ఫ్రై

పప్పు పులుసును అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు. మీరు దాల్ ఫ్రైని ప్రయత్నించాలి, ఇది చాలా సులభం, రుచి కూడా సూపర్‍గా ఉంటుంది. చేసేందుకు ఇబ్బందేమీ లేదు. ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచికరమైన దాల్ ఫ్రై వండుకోవచ్చు. ఈ వంటకం చాలా సులభం. దీన్ని ఎలా చేయాలో చూద్దాం?

కావాల్సిన పదార్థాలు

1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు మైసూర్ పప్పు (ఎరుపు పప్పు), ఒకటిన్నర కప్పుల నీరు, 1/2 స్పూన్ పసుపు పొడి, 2 ఉల్లిపాయలు (తరిగిన), 2-3 ఎండు మిరపకాయలు, 2 పచ్చిమిర్చి (సగానికి కట్ చేయాలి), 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గింజలు, కొద్దిగా ఇంగువ, 1 చెంచా మెంతి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి లేదా నూనె, 1/2 స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర రుచికి ఉప్పు,

ఎలా సిద్ధం చేయాలి

మీరు ముందుగా కుక్కర్‌లో పప్పు వేసుకోవాలి. వాటిని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పును మెత్తగా చేయాలి. ఇప్పుడు ఓ పాత్ర తీసుకుని అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఆవాలు వేసి, ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి, ఆపై ఎండు మిర్చి, తరువాత కరివేపాకు వేసి, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. పసుపు వేసుకోవాలి.

ఇది కొద్దిగా గోధుమ రంగులోకి మారిన తర్వాత మెంతిని జోడించండి. తర్వాత ఉడకబెట్టిన పప్పులను వేయాలి. అందులో ఉప్పు పొడి, గరం మసాలా పొడి వేసి మరిగించాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి మంట మీద నుంచి దించాలి. మంట నుంచి దించి అందులో 1/2 చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేస్తే రుచికరమైన దాల్ ఫ్రై రెడీ. ఈ దీపావళికి ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది.

Whats_app_banner