Millet Pongal Recipe : ఇది మామూలు పొంగల్ కాదండోయ్.. మిల్లెట్ పొంగలి..-today breakfast recipe is millet pongal here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millet Pongal Recipe : ఇది మామూలు పొంగల్ కాదండోయ్.. మిల్లెట్ పొంగలి..

Millet Pongal Recipe : ఇది మామూలు పొంగల్ కాదండోయ్.. మిల్లెట్ పొంగలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 16, 2022 07:10 AM IST

Breakfast Recipe : పొంగల్ అనేది చాలా ప్రముఖమైన, ప్రధానమైన వంట. చాలామంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే ఆరోగ్యంగా తీసుకోవాలనుకునే వారు మిల్లెట్ పొంగలి తినండి. ఇది మీకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. చేయడం కూడా సులభమే.

మిల్లెట్ పొంగలి
మిల్లెట్ పొంగలి

Millet Pongal Recipe : మిల్లెట పొంగలిని మిల్లెట్స్, పెసరపప్పుతో తయారు చేస్తారు. కాబట్టి ఇది చాలా పోషకమైనది. ఆరోగ్యకరమైనది కూడా. ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. అందుకే దీనిని అల్పాహారంగా లేదా మధ్యాహ్నా భోజనంగా కూడా తీసుకోవచ్చు. మీ కడుపును ఫుల్​ చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలికాకుండా చూస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* ఫాక్స్‌టైల్ మిల్లెట్ - అరకప్పు

* పెసరపప్పు - అరకప్పు

* నీరు - 4 కప్పులు

* అవకాడో నూనె - 2 టేబుల్ స్పూన్లు

* జీలకర్ర - 1 స్పూన్

* మిరియాలు - అర టీస్పూన్

* తరిగిన అల్లం - 1 టీస్పూన్

* కరివేపాకు - ఒక రెమ్మ

* జీడిపప్పు - 10

1/8 సి.డి.పి.లు 1/8 -6 కరివేపాకు 5-6 జీడిపప్పు

మిల్లెట్ పొంగల్ తయారు చేసే విధానం

మిల్లెట్, పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం వాటిని ఓ సారి కడిగి నీరు ఒడకట్టండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో అవకాడో నూనెను వేసి.. అది వేడెక్కిన తర్వాత.. జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించండి. ఇప్పుడు దానిలో జీడిపప్పు, కరివేపాకు, తరిగిన అల్లం వేయండి. జీడిపప్పు లేత బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

ఇప్పుడు నానబెట్టిన మిల్లెట్, పప్పును వేయండి. వాటిని 2 నిమిషాలు వేయించాలి. మూత మూసివేసి.. మీడియం మంట మీద లేదా 4-5 విజిల్స్ వచ్చే వరకు ప్రెజర్​పై ఉడికించాలి. ఒత్తిడి విడుదలైన తర్వాత మూత తెరిచి పొంగల్‌ను బాగా కలపండి. తాలింపు కోసం చిన్న తడ్కా పాన్‌లో అవకాడో ఆయిల్‌ను వేసి వేడి చేయండి. దానిలో జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పులు వేయండి. దానిని పొంగల్ పైన వేయండి. అంతే టేస్టీ, హెల్తీ పొంగల్ రెడీ. వేడి వేడిగా లాగించేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్