After Intercourse : శృంగారం తర్వాత కడుపులో నొప్పి వస్తుందా?
Abdominal Pain After Intercourse : శృంగారం చేసేప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో.. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత మంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు.
చాలా మంది సంభోగం తర్వాత పొత్తికడుపు తిమ్మిరిని అనుభవిస్తారు. అయితే ఇది మహిళలకు మాత్రమే కాకుండా కొన్నిసార్లు పురుషులకు కూడా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం..
చాలామంది వ్యక్తులు సంభోగం తర్వాత కడుపులో తిమ్మిరి లేదా నొప్పిని అనుభవిస్తారు. ఇది మీకు ఎప్పుడైనా జరిగిందా? ఈ సమస్య చాలా మందికి వస్తుంది. అయితే భయాందోళనలకు గురికాకండి. మీరు సరైన ప్లానింగ్ చేసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అయితే దీని వల్ల చిన్న చిన్న సమస్యలే కాదు కొన్నిసార్లు పెద్ద సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉంటుంది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
స్కలనం అనేది సంభోగం సమయంలో లేదా తర్వాత పొత్తికడుపు తిమ్మిరికి ఒక సాధారణ కారణం. సంభోగం తర్వాత కడుపులో నొప్పిని అనుభవించే వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సంభోగం సమయంలో పెల్విక్, ఇతర కండరాలు వేగంగా కుదించబడతాయి. దీనివల్ల కడుపునొప్పి వస్తుంది.
వ్యాయామం మాదిరిగానే, సెక్స్ సమయంలో పెల్విక్ లేదా పొత్తికడుపు కండరాలు ఒత్తిడికి గురవుతాయి. ఇది సెక్స్ సమయంలో లేదా తర్వాత మీరు తిమ్మిరి అనుభూతిని కలిగించవచ్చు. గట్టి కండరాలు, నిర్జలీకరణం, కొన్నిసార్లు కండరాలపై ఎక్కువ ఒత్తిడి కడుపు నొప్పికి కారణమవుతాయి. కానీ నొప్పి కొద్ది నిమిషాల్లోనే తగ్గిపోతుంది.
మీకు మూత్రాశయం లేదా మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, మీరు సంభోగం తర్వాత నొప్పి అనుభూతి చెందుతారు. మీకు ఇప్పటికే ఏదైనా మూత్రాశయ సమస్య ఉంటే అది సెక్స్ సమయంలో మరింత తీవ్రమవుతుంది. ఇద్దరిలో ఎవరికైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది.
సుదీర్ఘమైన సంభోగం కూడా పొత్తికడుపు తిమ్మిరి, నొప్పికి కారణమవుతుంది. కడుపు తిమ్మిరి, చికాకు, ముఖ్యంగా గర్భాశయంలో నొప్పి కలుగుతుంది. ఇది గర్భాశయానికి ఇన్ఫెక్షన్, గాయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
అందుకే సెక్స్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తీవ్ర సమస్యలు వస్తాయి. శృంగాన్ని ఎంజాయ్ చేయాలి. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. తగ్గిపోతుందిలే అనుకుని కొన్ని విషయాలను వదిలిపెట్టకూడదు. సమస్య ఎక్కువైతే చాలా ప్రమాదాలు వస్తాయి.