Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?-this benefits of a good credit score ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

HT Telugu Desk HT Telugu
Apr 04, 2022 04:13 PM IST

సాధరణంగా క్రెడిట్ స్కోర్ అధారంగా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ కంపెనీలు రుణ గ్రహస్థుడికి రుణాన్ని అందిస్తాయి. క్రెడిట్ స్కోర్ అధ్వాన్నంగా ఉంటే, రిస్క్ ఎక్కువ అలాగే బ్యాంకులు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, బ్యాంకు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.

Credit Score
Credit Score

ఏదైనా రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు క్రెడిట్ స్కోర్‌ అనేది అతి ముఖ్యమైన అంశం.   రుణాన్ని తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి సరిగ్గా రుణాన్ని  తిరిగి చెల్లిస్తున్నాడా? లేదా? అనేది క్రెడిట్ స్కోర్ సూచిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్‌ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో 'పాటు సులభంగా రుణాన్ని పొందవచ్చు. దీనితో పాటు, బ్యాంకులు కూడా సులభంగా రుణాలను మంజూరు చేస్తాయి. ఇక మంచి క్రెడిట్ స్కోర్ పొందడం వల్ల కలిగే  ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధరణంగా క్రెడిట్ స్కోర్ అధారంగా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ కంపెనీలు రుణ గ్రహస్థుడికి రుణాన్ని అందిస్తాయి. క్రెడిట్ స్కోర్ అధ్వాన్నంగా ఉంటే, రిస్క్ ఎక్కువ అలాగే బ్యాంకులు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, బ్యాంకు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దీనితో పాటు, క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నప్పుడు, బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతకు మరిన్ని రుణాలను ఆమోదిస్తుంది. బ్యాడ్ క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే అవసరానికి అనుగుణంగా రుణం లభించదు.  క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే, మీరు సులభంగా లోన్ పొందవచ్చు.

కస్టమర్ అవసరాన్ని బట్టి ఆమె రుణ పరిమితి కూడా పెరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డు పొందడం కూడా సులువతుంది.  మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ కంపెనీలు ప్రీ-అప్రూవ్డ్ లోన్ సదుపాయాన్ని అందిస్తాయి. దీంతో కారు లేదా ఇల్లు కొనాలనుకునే వారి సులభంగా రుణం పొందవచ్చు.

రుణాన్ని బదిలీ చేసుకునే సౌలభ్యం కూడా లభిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక బ్యాంకు నుండి అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకుని, ఆ తర్వాత తక్కువ ధరకు దానిని మరొక బ్యాంకుకు బదిలీ చేయాలనుకుంటే, అతను మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండడం ముఖ్యం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్