Avoid These Foods | అవి మంచివనుకుని తింటాం కానీ.. హృదయానికి మంచివి కాదంటా..
ఆరోగ్యంగా ఉండడానికి మనం మంచి ఆహారం తీసుకుంటాము. కానీ మంచి ఆహారం అనుకుని తీసుకునేవి మన హృదయానికి అనేక ప్రమాదాలను కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. పైగా అవి ఆరోగ్యానికి మంచి చేస్తాయని నమ్మి.. మన రెగ్యూలర్ డైట్లో తినేస్తామని తెలిపారు. ఇంతకీ ఆ ఆహారాలు ఏంటి.. వాటిని తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Side Effects of Every Day Foods | ప్రతిరోజూ ఆరోగ్యంగా ఉండడానికి పలు ఆహారాలు తీసుకుంటాము. కానీ అవి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా.. మిమ్మల్ని రోగాల బారిన పడేస్తాయని మీకు తెలుసా? అవునండి హెల్త్‌కి మంచిదని మనం తీసుకునే ఆహారాలు మనకి చాలా హానీ చేస్తాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వు, శుద్ధి చేసిన పిండి పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించాయి. అయితే దూరంగా ఉండాల్సిన అనారోగ్యకరమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తృణధాన్యాలు
చాలా మంది తృణధాన్యాలు గుండె ఆరోగ్యానికి మంచివని అనుకుంటారు. అయితే ఇది అతి పెద్ద అపోహల్లో ఒకటి. రిఫైన్డ్ తృణధాన్యాలు పూర్తిగా చక్కెరతో వస్తాయి. కాబట్టి ఇవి హృదయ ఆరోగ్యానికి అంత మంచివి కావని పోషకాహార నిపుణులు తెలిపారు.
సోడా
సోడా ఆరోగ్యకరమైనదని ప్రజలు అనుకుంటారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. సోడాలోని రసాయనాలు మన గట్ బాక్టీరియాను మార్చవచ్చు. ఒక్కోసారి ఇది గుండె ప్రమాదాన్ని పెంచుతాయి.
తాజా రసాలు
చాలా మంది చక్కెరను జ్యూస్ రూపంలో తీసుకుంటారు. చాలా జ్యూస్ సెంటర్లు తాజా పండ్ల రసంలో చక్కెరను కచ్చితంగా కలుపుతారు. చక్కెర మన హృదయానికి మంచిది కాదని మన అందరికి తెలుసు. అందుకే ఇంట్లో తయారు చేసిన జ్యూస్‌లు తీసుకోవడం ఉత్తమం.
వైట్ బ్రెడ్
వైట్ బ్రెడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశం ఉందని సింబోయిసిస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అంకుర్ తెలిపారు. ఈ బ్రెడ్స్ పూర్తిగా పిండి పదార్ధంతో నిండి ఉంటాయి. ఇవిడి యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలను కలిగిస్తాయి. ఇందులో ఫైబర్, జీర్ణక్రియను మందగించడానికి సహాయపడే ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.
ఉప్పు
ఎక్కువ ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటుకు గురవుతాము. ఇది గుండె వైఫల్యం, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, స్ట్రోక్, బోలు ఎముకల వ్యాధిని కలిగిస్తుంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు నోరు పొడిబారి.. చాలా దాహంగా అనిపిస్తుంది.
బియ్యం
బియ్యంలో అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. మీరు దానిని అధికంగా తీసుకుంటే అది మీకు మధుమేహం వచ్చే అవకాశాలను పెంచుతుంది.
సంబంధిత కథనం