Blood Jewellery : ఈ అందమైన ఆభరణాలు రక్తంతో తయారు చేశారు.. ఎందుకంటే..
Blood Jewellery : సాధారణంగా ఆభరణాలు బంగారం, వెండి, ప్లాటినంతో చేస్తారు. కొందరు పూసలు ఆభరణాలు, రాతితోచేసినవి వేసుకుంటారు. అయితే ఓ మహిళ మాత్రం.. రక్తంతో ఆభరణాలు తయారుచేస్తుంది. ఏంటీ అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే ఆమె రక్తంతో ఆభరణాలు చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
Jewellery Making With Blood : మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను స్క్రోలింగ్ చేయడాన్ని ఇష్టపడే వారైతే.. మీరు కూడా ఈ రీల్ చూసే ఉంటారు. ఎందుకంటే ఓ మహిళ అందరికంటే భిన్నంగా.. నిజమైన మానవ రక్తంతో ఆభరణాలు తయారు చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఆమె రక్తంతో అందమైన రింగులు, ఆకర్షించే లాకెట్టులను రూపొందించింది. జీవించి లేని తండ్రికి సంబంధించిన ఎండిన రక్తాన్ని ఉపయోగించి ఆభరణాలు తయారు చేసినట్లు ఆమె తన క్యాప్షన్‌లో తెలిపింది. మానాన్న విడిచిపెట్టిన కుటుంబం దుఃఖంలో ఉంది. వారికి ఇది కాస్త ఓదార్పునిస్తుంది అంటూ రాసుకొచ్చింది.
డీఎన్ఏ కలిగిన మెటీరియల్‌ని ఉపయోగించి ప్రత్యేకమైన ఆభరణాలను తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన ప్రీతీ మాగో అనే మహిళ ఈ ఆభరణాలను తయారు చేసింది. ఆమె ఒక్క మానవరక్తమే కాదు.. తల్లి పాలు, వెంటుక్రలు, బొడ్డు తాడు ఇలా ఒకటేంటి.. చాలా వాటితో ఆభరణాలు తయారు చేస్తుంది ఈమె. @the_magic_of_memories' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఈ పేజ్ ద్వారా మీరు నచ్చినవి ఆర్డర్ ఇవ్వొచ్చు. కొనొచ్చు.
యూఎస్ నుంచి కొన్ని జ్యువెలరీ కోర్సులు చేసి.. మొదట తన పాలను ఉపయోగించి ఆభరణాలను తయారు చేసింది. అలా.. తర్వాత తన స్నేహితులు, కుటుంబ సభ్యుల తల్లిపాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించినట్లు ప్రీతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చాలా వైఫల్యాలు, అభ్యాసాల తర్వాత 2019లో వ్యాపారాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అప్పటినుంచి కస్టమర్లకు గుర్తుండిపోయే ఇతర వస్తువులతో జ్యువెలరీ తయారు చేస్తూ.. వాటిని సంరక్షించడంలో సహాయం చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్