Vastu | వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ వాస్తు నియమాలు తప్పనిసరి-these are the vastu tips for happy married life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Are The Vastu Tips For Happy Married Life

Vastu | వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ వాస్తు నియమాలు తప్పనిసరి

Maragani Govardhan HT Telugu
Jan 09, 2022 07:34 PM IST

పదే పదే సమస్యలు తలెత్తుతుంటే వాటి గురించి తప్పకుండా ఆలోచించాలి. వాస్తు దోషాల వల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా వాటిని సరిదిద్దుకోవచ్చు. ఫలితంగా మీ దాంపత్య జీవితం తిరిగి ఆనందదాయకంగా, కలర్​ఫుల్​గా మారుతుంది.

వాస్తు చిట్కాలు
వాస్తు చిట్కాలు (Hindustan times)

Vastu.. ప్రతి మనిషి జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తర్వాత దాంపత్య జీవితం ఆనందదాయకంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కాలక్రమేణా ఆలుమగల మధ్య ఎన్నో విభేదాలు, కలతలు వస్తుంటాయి. ఇవి మితిమీరితే సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భార్య-భర్తల మధ్య అవగాహన, సర్దుకుపోయేతత్వం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వారి జీవితం సుఖమయం అవుతుంది. అలా కాకుండా ఇద్దరి మధ్య అన్యోన్యత ఉన్నా, సర్దుకుపోతున్నా పదే పదే సమస్యలు తలెత్తుతుంటే వాటి గురించి తప్పకుండా ఆలోచించాలి. వాస్తు దోషాల వల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా వాటిని సరిదిద్దుకోవచ్చు. ఫలితంగా మీ దాంపత్య జీవితం తిరిగి ఆనందదాయకంగా, కలర్​ఫుల్​గా మారుతుంది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించి బంధం బలపడుతుంది. మరి ఆ వాస్తు చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

బెడ్​రూం విండో..

పడకగది చీకటిగా ఉంచుకోవాలనుకోవడం మీ అభిరుచి కావచ్చు. అయితే మీ ఇష్టం ఎలా ఉన్నా బెడ్​రూంలో మాత్రం తప్పకుండా కిటికీ ఉండాలి. ఎందుకంటే అప్పుడే మీలో ఒత్తిడి తగ్గి ఇరువురి మధ్య ప్రేమ పెరుగుతుంది.

అద్దం..

పడకగదిలో అద్దం కూడా తప్పకుండా ఉంచాలి. అది కూడా వాస్తు నిపుణుడిని సంప్రదించి సరైన దిశలో పెట్టాలి. ఇది ఆలు-మగల మధ్య అంతరాన్ని తొలగించి బంధం బలపడేలా చేస్తుంది.

లవ్ బర్డ్..

బెడ్​రూంలో లవ్ బర్డ్స్​ను చిత్రాన్ని ఉంచాలి. అది మీ ఇద్దరి మధ్య ప్రేమ భావనను పెంచుతుంది. ఎందుకంటే లవ్ బర్డ్స్ ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. అదే విధంగా ఈ చిత్రం భార్య-భర్తల మధ్య ఆనందానికి కారణమవుతుంది.

ముళ్లు కలిగిన పువ్వులను ఉంచవద్దు..

మీ పడకగదిలో వాడిపోయిన, ఎండిపోయిన పూలను అస్సలు ఉంచకూడదు. వీటితోపాటు ముళ్లు కలిగిన పూలను పొరపాటున కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇవి ఆలు-మగల మధ్య ఒత్తిడి, ఆందోళనలను పెంచుతాయి.

నిద్రించే స్థానం సరిగ్గా ఉండాలి..

పడకగదిలో భార్య-భర్తలు నిద్రించే స్థానం(Sleeping posture) సరిగ్గా ఉండాలి. భార్య ఎప్పుడూ భర్తకు ఎడమవైపునే నిద్రించాలి. ఇరువురు పెద్దగా ఉండే ఒకే దిండును ఉపయోగించాలి. ఇది ఇద్దరి మధ్య పరస్ఫర ప్రేమను పెంచుతుంది.

రంగుల ఉపయోగం..

భార్య-భర్తల బెడ్​రూం లేత గులాబీ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఈ కలర్స్ ఆహ్లాదకరాన్ని సూచిస్తాయి. ముదురు రంగులను ఉపయోగించకూడదు. పడకగదిలో ఉండే రంగులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా భాగస్వామిని దగ్గరకు చేర్చడంలో తోడ్పడుతాయి.

బెడ్​రూంలో దేవుళ్ల బొమ్మలు..

ఆలు-మగలు పడుకునే పడకగదిలో దేవతలు లేదా దేవుళ్ల బొమ్మలను ఉంచవద్దు. దంపతుల పాదాల వైపున నీటి ప్రవాహాన్ని సూచించే చిత్రాలను ఉంచాలి. ఎందుకంటే ప్రవహించే ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు.

మనీ ప్లాంట్ ఉంచండి..

వాస్తుప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం శుభప్రదమని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఈ చెట్టు శుక్రుడిని సూచిస్తుంది. శుక్ర గ్రహం భార్య-భర్తల బంధాన్ని మధురంగా మార్చడంతో పాటు వారి మధ్య ప్రేమను పెంపొందించేందుకు సహాయం చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం