Yoga Mistakes | యోగా చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి-these are the five common mistakes on yoga ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga Mistakes | యోగా చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

Yoga Mistakes | యోగా చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

Maragani Govardhan HT Telugu
Feb 18, 2022 05:10 PM IST

రోజువారీ దినచర్యలో యోగాను భాగం చేయడం, నిరంతరం దీన్ని కొనసాగించడం కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆశించిన ఫలితాలు త్వరగా కనిపించకపోవచ్చు. అంతేకాకుండా యోగా కనిపించేంత సులభం కాదు. వివిధ రకాల భంగిమలు, క్లిష్టమైన విన్యాసాలను చేసేటప్పుడు కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది.

యోగా పొరపాట్లు
యోగా పొరపాట్లు (Hindustan Times)

Yoga Mistakes.. భారతదేశం ప్రపంచానికి అందించిన అతి ముఖ్యమైన ఆరోగ్య విధానం యోగా. అతి ప్రాచీనమైన ఈ అభ్యాసాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విధిగా ఆచరిస్తున్నారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. అంతేకాకుండా ఎన్నో రకాల అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ దినచర్యలో యోగాను భాగం చేయడం, నిరంతరం దీన్ని కొనసాగించడం కష్టంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆశించిన ఫలితాలు త్వరగా కనిపించకపోవచ్చు. అంతేకాకుండా యోగా కనిపించేంత సులభం కాదు. వివిధ రకాల భంగిమలు, క్లిష్టమైన విన్యాసాలను చేసేటప్పుడు కొన్ని తప్పులు చేసే అవకాశముంది. ఈ తప్పిదాల వల్ల ప్రమాదముంటుంది. కాబట్టి అవేంటో ఇప్పుడు చూద్దాం.

శ్వాసను క్రమబద్ధంగా తీసుకోకపోవడం..

యోగాలో శ్వాస తీసుకోవడం, దాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమైన ప్రక్రియ. యోగాసనాలు వేసేటప్పుడు సక్రమమైన రీతిలో శ్వాసను తీసుకోవాలి. ప్రతి భంగిమలోనూ నిర్దిష్టమైన శ్వాస టెక్నిక్ ఉంటుంది. సరైన రీతిలో తీసుకున్నప్పుడే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇందుకోసం యోగా నిపుణుడు లేదా శిక్షకుడిని సంప్రదించాలి.

ఆలోచనలతో వ్యాయామం..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. చెదురుమదురు ఆలోచనలతో వ్యాయామం చేయడం వల్ల ఫలితం పెద్దగా ఉండదు. ముఖ్యంగా యోగా చేసేటప్పుడు మీ మనస్సు మీ నియంత్రణలో ఉండాలి. ఏకాగ్రత యోగా భంగిమపై ఉంచాలి. లేకుంటే యోగాసనం ప్రభావం తగ్గి పెద్దగా ప్రయోజనాలు కనిపించవు.

ప్రాక్టీస్ లేకపోవడం..

యోగాను ఎంత మనసు పెట్టి చేసినప్పటికీ ఫలితం రాలేదంటే అర్థం మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయడం లేదని తెలుసుకోవాలి. ముఖ్యంగా యోగాలో నైపుణ్యం సాధించడం అంత సులభం కాదు. అందులోని భంగిమలు, ఆసనాలు, పద్ధతులను తెలుసుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి నిరంతర ప్రాక్టీస్ వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. తెలివైన వ్యక్తి ఎప్పుడూ శిక్షణను పరిపూర్ణంగా చేస్తాడు.

అసౌకర్యమైన దుస్తులను ఎంచుకోవడం..

యోగా కోసం ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకోవాలి. ఎందుకంటే యోగాభ్యాసంలో శరీర భాగాలను గణనీయంగా వంచాల్సి ఉంటుంది. బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే యోగా చేయడం కష్టమవుతుంది. చెడు యోగా విధానాలు అసమర్థ ఫలితాలకు దారితీస్తాయి. కాబట్టి వ్యక్తులు తమ దుస్తులను వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఫాబ్రిక్ తో కూడిన మృదువైన దుస్తులను ఎంచుకోవాలి.

అవాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం..

లక్ష్యాలు ఎప్పుడూ వాస్తవికంగా ఉండాలి. వాటిని కొనసాగించేందుకు వాస్తవిక మార్గాన్నే అన్వేషించాలి. సాధ్యం కాని లక్ష్యాలను నిర్దేశించుకోవడం, నెరవేరని ఫలితాలను కోసం ఎదురుచూడటం వల్ల ప్రేరణ కోల్పోవడమే కాకుండా మీ శ్రమ వృథా అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్