Milk | పాలు ఎప్పుడు తాగితే మంచిది? పిల్లలకు పల్చని లేదా చిక్కటి పాలు..ఏది బెటర్?
చాలా మంది తమ రోజు వారీ డైట్‌లో పాలు చేర్చుకోరు. వయస్సుతో సంబంధంతో లేకుండా ప్రతి ఒక్కరు రోజూ పాలు తాగాలని చెబుతున్నారు వైద్యులు. ఏ సమయంలో పాలు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి కావాల్సిన పోషకాలు, సూక్ష్మ పోషకాలు అందించడంలో అందరికీ అందుబాటులో ఉండే పాలది కీలక పాత్ర. ప్రోటీన్, కాల్షియం సరిపడా అందాలంటే ఉదయం పాలు తాగడం శ్రేయస్కరం అంటున్నారు వైద్యులు. ఎముకలు, కండరాలకు కాల్షియం, ప్రోటీన్ ఎంతో అవసరం. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్లు తప్పనిసరిగా పాలు తాగాలి. నిజానికి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
- ఉదయం పాలు తాగితే కడుపు నిండుగా ఉండి కొంతమంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటప్పుడు ఉదయం పాలు తాగడం మానేయండి.
- రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగితే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. నిద్ర సమస్యతో బాధ పడేవారు ఇలా చేసి చూడొచ్చు.
- రాత్రి పూట పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురైన వారు ఉన్నారు. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పడుకునే ముందు పాలు తాగకపోవడమే మంచిది.
- ఏ సమయంలోనైనా పాలు తాగాలనుకున్నప్పుడు గోరు వెచ్చని పాలు తాగడం మంచిది.
పిల్లలకు ఏ పాలు ఇవ్వాలి?
పిల్లలకు పల్చని పాలు పట్టాలా? లేక చిక్కటి పాలు పట్టాలా? అని చాలా మంది తల్లులు అడుగుతుంటారు. చిన్న పిల్లలకు జీర్ణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు పట్టడం మంచిది అనుకుంటారు కొందరు తల్లులు. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలు పడితే ఊబకాయం, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని భయపడుతుంటారు. కానీ ఇదంతా అపోహే అని అధ్యయనాల్లో తేలింది.
ఆవు, గేదె పాలు మధ్య తేడా ఏంటి?
గేదె పాల కంటే ఆవు పాలల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి. ఆవు నుంచి పాలను తీసిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే వాడాలి. ఆవు పాలల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే ఆవు పాలను పిల్లలకు ఇస్తారు. గేదె పాలల్లో భాస్వరం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా లభిస్తాయి. ఇవి రెండు రోజుల కంటే ఎక్కువగానే నిల్వ ఉంచుతారు. వీలైనంత వరకు తాజా పాలు వాడడమే మంచిది.
సంబంధిత కథనం