Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. ఏప్రిల్ 10-ఏప్రిల్ 16 వరకు-tarot card predictions for april 10 april 16 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. ఏప్రిల్ 10-ఏప్రిల్ 16 వరకు

Weekly Horoscope | ఈవారం రాశి ఫలాలు.. ఏప్రిల్ 10-ఏప్రిల్ 16 వరకు

HT Telugu Desk HT Telugu
Apr 10, 2022 03:19 PM IST

Weekly Tarot Card Readings: ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, వాస్తు శాస్త్ర నిపుణులు మనీషా కౌశిక్ అందించిన ఈ వారం రాశి ఫలాలు పుట్టిన తేదీ ఆధారంగా ఇలా ఇచ్చారు..

<p>Weekly Horoscope</p>
Weekly Horoscope (Stock Photo)

ఏప్రిల్ 10-ఏప్రిల్ 16 వరకు రాశి ఫలాలు

మేష రాశి (మార్చి 21-ఏప్రిల్ 20)

ఈ వారం అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మీరు చేపట్టిన ప్రాజెక్ట్‌లను ఈ వారం పూర్తి చేయవచ్చు. అయితే కొత్త ప్రాజెక్టులను ఎంచుకునే విషయంలో తొందరపడకండి. మీ లక్ష్యాలపై దృష్టిపెట్టండి; మేష రాశి వారికి ఈ వారం ఏదో ఒక విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అయితే వ్యక్తిగత ప్రయత్నం ఉండాలి. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. బరువు నియంత్రణ, డైటింగ్, ఇతర క్రీడలు ఆడటంపై ఆసక్తి చూపుతారు. భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. భాగస్వామి నుంచి లభించే తోడ్పాటుతో జీవితంలో మరింత ఎదిగే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. వ్యాపారస్తులు నగదు కొరతను ఎదుర్కొంటారు, అయితే అవసరాలకు డబ్బు సమకూరుతుంది.

వృషభం (ఏప్రిల్ 21-మే 20)

ఈ వారం వృషభ రాశి వారు వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇతరులతో వ్యవహరించేటపుడు తెలివిగా అదే సమయంలో నిదానంగా ఉండాలి. ఆవేశం పనికిరాదు, అనవసరంగా వ్యక్తులను దూరం చేసుకోవాల్సి వస్తుంది. కెరీర్ పరంగా అనేక అవకాశాలు మీ తలపు తడతాయి. అయితే ఏది మంచిదో జాగ్రత్తగా ఆలోచించి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమందికి స్నేహ బంధం ప్రేమగా చిగురించే అవకాశం ఉంది. కొన్ని విషయాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. పెట్టుబడుల విషయంలో సరైన వ్యక్తుల లేదా నిపుణులను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఇది మీకు అదనపు ఆదాయం తీసుకురావొచ్చు. ఈ వారం మీరు చేసే ప్రయత్నాలన్నీ మీకు సానుకూల ఫలితాలనే తీసుకువస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యవహార శైలితో విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా అంతా మీరే కరెక్ట్ అనుకోకుండా సమతుల్యత పాటించడం మంచిది.

మిథునం (మే 21-జూన్ 21)

మీపై మీకు నమ్మకం పెరుగుతుంది, రెంటింపు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. మీకై మీరు తీసుకునే చర్యలు మీ జీవితంలో అనేక ప్రయోజనాలను చేకూర్చవచ్చు. వృత్తిపరంగా అంతా అనుకూలంగా ఉంది, మీ గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. MNC లేదా విదేశీ క్లయింట్‌లు కలిగిన వారికి ఉద్యోగ విషయంలో మంచి ప్రయోజనం దక్కుతుంది. మీ భవిష్యత్తు వృద్ధిపై ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లపై ఆసక్తిని కనబరుస్తారు. మీరు చేపట్టే ప్రాజెక్టులు మంచి లాభాలను చేకూరుస్తాయి. కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఫిట్‌నెస్ పై దృష్టిపెట్టండి ఇది మీకు ఒత్తిడిని అధిగమించడానికి తోడ్పడుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. భార్యభర్తల మధ్య లేదా భాగస్వాముల మధ్య కొంత అసంతృప్తి ఉంటుంది. మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం (జూన్22-జూలై 22)

కర్కాటక రాశి వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం ఇది. ఎలాంటి పరిస్థితులనైనా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. అప్రయత్నంగా విజయం మీ సొంతం అవుతుంది. వృత్తిపరంగా మీ స్థానం మరింత బలోపేతం అవుతుంది. పనిచేసే చోట ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటపుడు కేవలం మీ వైపు నుంచే కాకుండా మీ కుటుంబ సభ్యుల వైపు నుంచి కూడా ఆలోచన చేయడం మంచిది. ప్రేమలో ఉన్న వారికి, సహజీవనంలో ఉంటున్న జంటలకు వారి కుటుంబ పెద్దల నుంచి చిన్నపాటి వ్యతిరేకత వచ్చినా, మీ బంధానికి విలువ ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మానసికంగా దృఢంగా ఉండటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో మంచి ప్రతిఫలాన్ని తీసుకురావచ్చు. వ్యాపారాన్ని కలిగి ఉన్నవారు కొత్త ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు ఆర్థికంగా లాభాన్ని ఆశించవచ్చు.

సింహ రాశి (జూలై 23-ఆగస్టు 23)

ఈ వారం, మీరు మీ లక్ష్యం దిశగా ప్రణాళికల అమలును పర్యవేక్షిస్తారు. మీరు చేపట్టే పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరాటంకంగా సాగుతాయి. అయితే కొన్ని ఒత్తిళ్లు ఉండవచ్చు. యోగ, ధ్యానం లాంటివి చేయడం వలన ఏకాగ్రత సాధించవచ్చు.

మీరు పెట్టిన పెట్టుబడులు లేదా డబ్బు విషయంలో మీరు చేసిన ఆదా మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఆర్థికంగా మీరి మరింత వృద్ధి చెందుతారు. పాత రుణాలు ఏవైనా ఉంటే ఇప్పుడే చెల్లించడం మంచిది. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండవచ్చు. ప్రమోషన్ లేదా బదిలీ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. భాగస్వామితో మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. భాగస్వామితో మీరు చేసుకునే అవగాహన మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)

మీ బలాలేంటో గుర్తించండి మీపై మీరు నమ్మకముంచండి. ఇప్పుడు ఉన్నదానితో ఆత్మసంతృప్తి పొందితే జీవితంలో పైకి ఎదగలేరు అని గుర్తించాలి. మీ కలలను, ఆశయాల సాకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఇది. మీపై అభిమానం, ఇష్టం చూపేవారిని తిరస్కరించడం మంచిది కాదు. అందివచ్చిన అవకాశాలను జారవిడవ వద్దు. పూర్తి విచక్షణతో నిర్ణయాలు తీసుకోండి. అభినందనలను ఆనందంగా స్వీకరించండి, ఇది మీకు ఉల్లాసభరితమైన మార్గాన్ని చూపవచ్చు. వృత్తిపరంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మరింత శ్రమపడాల్సి వస్తుంది. సహోద్యోగుల మద్ధతుతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టండి, ముఖ్యంగా కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు ఇతర శారీరక నొప్పులను అశ్రద్ధ చేయకండి. మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలు ఈ వారం నెరవేరకపోవచ్చు. విశ్వసనీయ వ్యక్తుల సలహాలు, సహాకారం తీసుకోవడం మంచిది.

తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టండి. అనుకూల ఫలితాలను త్వరలోనే ఆస్వాదించవచ్చు. దృఢమైన సంకల్పంతో, ధైర్యంగా ముందడుగు వేయండి మీరు జీవితంలో కోరుకున్నది త్వరలోనే మీ సొంతం అవుతుంది. ఈ వారం మీరు మీ అందం, వ్యక్తిత్వాన్ని మరింతగా ఎలా మెరుగుపరుచుకోవడం అనే దానిపై ఆలోచనలు చేస్తారు. అవివాహితులు వివాహ సంబంధ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు, అందుకు పరిస్థితులు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ప్రమోషన్లు, బదిలీ ప్రయత్నాలు చేస్తున్న వారికి అదృష్టం కలిసివస్తుంది. తమకు నచ్చిన పోస్టింగ్ లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడానికి మీ తోటివారు మీకు సహాయం చేస్తారు. కొంతమంది ఎట్టకేలకు గృహం లేదా స్థలం కొనుగోలు చేయవచ్చు.

వృశ్చిక రాశి (అక్టోబర్ 24-నవంబర్ 22)

ఈ వారమంతా మీరు మీ శక్తి, సామర్థ్యాలపై నమ్మకంగా ఉంటారు. ప్రస్తుతం మీకు లభించిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఒక కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేసే సూచనలు ఉన్నాయి. ఆ పరిచయం మీకు ఏదైనా తీపి జ్ఞాపకాన్ని మిగిల్చవచ్చు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులను లేదా పెద్దలను సంప్రదించండం ఉత్తమం. పనిచేసే చోట మరింత స్థిరత్వం కోసం మీ నైపుణ్యాలతో మీ పైవాళ్లను ఒప్పించగలరు. వృత్తిపరంగా అనేక అవకాశాలు మీ ముందు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధపెట్టండి.. ఒత్తిళ్లను అధిగమించడానికి వ్యాయామం చేయాలి. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, కొనుగోళ్లను ఈ వారం వాయిదా వేయండి. ఊహించని సంఘటనలు మీ ఆకాంక్షలకు భంగం కలిగించవచ్చు.

ధనుస్సు రాశి (నవంబర్ 23-డిసెంబర్ 21)

కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆత్మీయులకు సంబంధించిన ఒక విషయం మిమ్మల్ని ఆనందానికి లేదా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కష్టసుఖాల సమతుల్యత ఉంటుంది. ప్రేమ ప్రతిపాదనలు, నిశ్చితార్థం లేదా వివాహ సంబంధమైన ప్రయత్నాలకు అనుకూలం. మీ శారీరక రూపాన్ని మెరుగుపరచుకోవడాని ప్రయోగాలు చేయకుండా, సహజమైన మార్గాలను అనుసరించండి. ఇక వృత్తిపరంగా మీకు మీ సీనియర్ల నుంచి ఓ విషయంలో స్పష్టత లభించే అవకాశం ఉంది. ఈ వారం మీ బడ్జెట్ కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. పొదుపుమార్గాలను అన్వేషించండి. వివిధ రకాల పనులతో ఈ వారం మీరు తీరికలేకుండా గడుపుతారు. విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

మకరరాశి (డిసెంబర్ 22-జనవరి 21)

వ్యాపారంలో నష్టాలు ఉంటాయి, నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎలాంటి వ్యవహారాల్లోనైనా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.  వృత్తిపరంగా కొత్త ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం మారే ఆలోచనలు చేయవచ్చు. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ వారం మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటూ ముందుకుసాగాలి. భాగస్వామితో ప్రేమగా మెలగండి. ఈ వారం మీ సహనానికి, ఓర్పుకు పరీక్షకావొచ్చు. మనోధైర్యంతో ముందడుగు వేయండి.

కుంభం (జనవరి 22-ఫిబ్రవరి 19)

మీ భవిష్యత్తు గురించి స్పష్టమైన ఆలోచన కలిగి ఉండండి. సంపూర్ణ అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి. అనాలోచిత నిర్ణయాలతో మీకు ఇష్టమైన వారు మీకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే ఉంటాయి, వివిధ రకాల పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం. అర్థికంగా నిలదొక్కుకోవడా మీరు ఒక ముఖ్యమైన మైలురాయిని సాధిస్తారు. మీ ఆత్మీయులతో విభేదాలను తొలగించుకోవడానికి అవసరమయ్యే ప్రతీపని చేయండి, ఏమాత్రం ఆశను వదులుకోవద్దు.నికి కొత్త ప్రణాళికలు, కొత్త వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20)

జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోడానికి ఇది అనువైన సమయం. ప్రణాళికా బద్ధంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి.

ఈ వారం మీ మనస్సు చంచలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరకపోవచ్చు. ఇంకొంత సమయం ఎదురుచూడాల్సి రావొచ్చు. మీ నైపుణ్యాలను మరింత పెంచుకోండి. ఆర్థికపరమైన లావాదేవీల్లో స్వల్ప నష్టాలు ఉండవచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. విహారయాత్ర అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం