స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. పిల్లలకు లంచ్ బాక్స్ ఐడియా-sweet corn fried rice recipe for kids a healthy and delicious lunchbox option ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. పిల్లలకు లంచ్ బాక్స్ ఐడియా

స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. పిల్లలకు లంచ్ బాక్స్ ఐడియా

HT Telugu Desk HT Telugu
Aug 16, 2023 02:13 PM IST

Sweet Corn Fried Rice Recipe: మీరు పిల్లలకు లంచ్ బాక్స్ కూడా ఇవ్వవచ్చు. ఇంట్లో ఏదైనా ప్రత్యేకత ఉంటే, దానిని తయారు చేయండి మరియు మీ అతిథులు దానిని తినడానికి ఇష్టపడతారు.

స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్
స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్

స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెసిపీ వెరైటీగా ఉండడమే కాకుండా మీ నాలుకకు మంచి రుచిని ఇస్తుంది. మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. స్వీట్ కార్న్‌లను జోడించడం వల్ల మీ శరీరానికి పోషణ లభిస్తుంది. మొక్కజొన్నలోని తీపి రుచి, మసాలా దినుసులు, ఇతర కూరగాయలు కలిసి ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించవచ్చు. పిల్లలు దీని రుచిని చాలా ఇష్టపడతారు.

స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్‌ రెసిపీకి కావాల్సిన ఆహార పదార్థాలు

  1. నెయ్యి లేదా నూనె - 1 టేబుల్ స్పూన్
  2. ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
  3. అల్లం - 1 అంగుళం (సన్నగా తరిగినది)
  4. వెల్లుల్లి - 5 (సన్నగా తరిగినవి)
  5. ఉల్లి ఆకు - 4
  6. పచ్చిమిర్చి - ఒకటి లేదా రెండు (తరిగినవి)
  7. ఎండు మిర్చి - ఒకటి రెండు
  8. మిరియాలు
  9. ఉప్పు - తగినంత
  10. మిరియాల పొడి - కొద్దిగా
  11. ఉడికించిన స్వీట్ కార్న్ - 1 కప్పు
  12. ఉడికించిన బాస్మతి బియ్యం - 1 కప్పు
  13. మసాలా దినుసులు, పసుపు

స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తయారీ విధానం

  1. బాణలిలో నూనె వేసి వేడి చేయండి. తరిగిన ఉల్లిపాయను ఇందులో వేసి బాగా వేయించాలి.
  2. పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి ఆకు, ఎండు మిర్చి, మసాలా దినుసులు ఇలా అన్నీ ఒక్కొటొక్కటిగా వేస్తూ వేయించాలి.
  3. తర్వాత బాణలిలో తగినంత ఉప్పు, కారం వేసి ఫ్రై చేయాలి.
  4. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ దీనిలో వేసి కలపాలి.
  5. చివరగా ఇంతకుముందే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి బాగా కలపాలి.

అంతే ఇప్పుడు మీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తినడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఇంకా ఏవైనా కూరగాయలు జత చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ వంటివి మంచి రుచిని ఇస్తాయి. ఇవి కూడా వేయాలనుకుంటే ముందుగా నూనెలో తగినంత ఫ్రై అయ్యేలా చూసుకోవాలి.

పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పంపవచ్చు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా ఇది వడ్డించవచ్చు. అతిథులు దీనిని తినడానికి ఇష్టపడతారు.

(గమనిక: మీ వద్ద వెరైటీ రెసిపీలు ఉంటే మాకు పంపండి. మీ పేరు, ఫోటోతో సహా ప్రచురిస్తాం. మా ఈమెయిల్ ఐడీ praveen.lenkala@htdigital.in )

Whats_app_banner