carrot rice: లంచ్ బాక్స్‌లోకి రుచికరమైన క్యారట్ రైస్-lunch box recipe carrot rice cooking process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Rice: లంచ్ బాక్స్‌లోకి రుచికరమైన క్యారట్ రైస్

carrot rice: లంచ్ బాక్స్‌లోకి రుచికరమైన క్యారట్ రైస్

Koutik Pranaya Sree HT Telugu
May 14, 2023 12:25 PM IST

carrot rice: క్యారట్ రైస్ సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మధ్యాహ్న భోజనంలోకి, రాత్రి పూట ఈ క్యారట్ రైస్ తినొచ్చు.

క్యారట్ రైస్
క్యారట్ రైస్ (free pic)

ఎప్పుడైనా లంచ్ బాక్సులోకి, మధ్యాహ్న భోజనం వండడానికి సమయం లేకపోతే ఈ క్యారట్ రైస్ చేసి చూడండి. తక్కువ సమయంలో అయిపోతుంది. మసాలాల వల్ల బిర్యానీ తిన్న అనుభూతి కలుగుతుంది. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సులువుగా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బాస్మతీ బియ్యం

1 కప్పు క్యారట్ తురుము

సగం కప్పు సన్నగా తరిగిన క్యారట్ ముక్కలు

1 ఉల్లిపాయ

1 టేబుల్ స్పూన్ జీడిపప్పు

2 లవంగాలు

1 బిర్యానీ ఆకు

2 యాలకులు

అంగులం దాల్చిన చెక్క ముక్క

సగం స్పూన్ ధనియాల పొడి

సగం స్పూన్ జీలకర్ర పొడి

సగం స్పూన్ గరం మసాలా

4 వెల్లుల్లి రెబ్బలు

2 టేబుల్ స్పూన్ల నూనె

తయారీ విధానం:

  1. ముందుగా బాస్మతీ బియ్యాన్ని కడిగి పొడిపొడిగా ఉండేలా అన్నం వండుకోవాలి.
  2. పొయ్యిమీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. మసాలాలు వేగాక జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త వేగాక ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి.
  3. ఉల్లిపాయ ముక్కలు వేగాక క్యారట్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. 2 నిమిషాలయ్యక క్యారట్ తురుము కూడా వేసుకోవాలి.
  4. క్యారట్ ఉడికాక ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని వేగనివ్వాలి.
  5. కొత్తిమీర తరుగు వేసుకుని ముందే ఉడికించి పెట్టుకున్న బియ్యం కలుపుకోవాలి. అంతే.. క్యారట్ రైస్ సిద్ధమవుతుంది.

Whats_app_banner