Swapna Shastram। మీకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు కలగన్నారా? అయితే దాని అర్థం ఇదే!
Swapna Shastram: కలలో కూడా భార్యను చూడటం మీలో ఎంతమందికి ఇష్టం ఉందో, లేదో తెలియదు కానీ, ఇలాంటి కలలకు కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.
Swapna Shastram- Dreaming of Wife: కలలు కనడం ఒక సాధారణ ప్రక్రియ. దాదాపు మనలో చాలా మంది రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటారు. కొందరికి ఈ కలలు తరచుగా వస్తే, మరికొందరికి అరుదుగా వస్తాయి. కొన్నిసార్లు భయంకరమైన పీడ కలలు వచ్చి మన నిద్ర చెడగొట్టవచ్చు, కొన్నిసార్లు ఒక పిచ్చి కల మనల్ని నవ్వించవచ్చు. అలాగే కొన్నిసార్లు అందమైన కలలు రావచ్చు, కొన్నిసార్లు శృంగారభరితమైన కలలు రావచ్చు. ఇది మాత్రమే కలల్లో కనిపించే వ్యక్తులు మనకు బాగా తెలిసిన వారే అయి ఉండవచ్చు, కొన్నిసార్లు అపరిచయస్తులు ఉండవచ్చు. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం, మనకు కలిగే ప్రతీ కలకు ఏదో ఒక అర్థం ఉంటుంది. మన జీవితంలో జరగబోయే సంఘటనలకు కూడా ఇది ముందస్తు సూచికగా ఉంటుంది. అందువల్ల మీకు వచ్చిన కల మీకు జ్ఞాపకం ఉంటే దాని ఆధారంగా జరగబోయేది ఊహించవచ్చు అని స్వప్నశాస్త్రం చెబుతుంది.
అయితే మీరు ఎప్పుడైనా మీ కలలో మీ భార్యను చూశారా? లేదా మీకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు కలవచ్చిందా? కలలో కూడా భార్యను చూడటం మీలో ఎంతమందికి ఇష్టం ఉందో, లేదో తెలియదు కానీ, ఇలాంటి కలలకు కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. మరి కలలో భార్య కనిపిస్తే మంచిదా చెడ్డదా అనేది ఇక్కడ తెలుసుకోండి.
కలలో భార్యను చూడటం అంటే ఏమిటి?
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో భార్యను చూడటం శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ప్రేమ మరింతగా వికసిస్తుందని ఈ కల సూచిస్తుంది.
కలలో మీ భార్యతో మాట్లాడటం అంటే ఏమిటి?
కలలో మీరు మీ భార్యతో మాట్లాతుండటం అంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నారని అర్థం. లేదా సమీప భవిష్యత్తులో మీ జీవితంలో ఏవైనా సమస్యలు రాబోతున్నాయని అర్థం.
కలలో మీ భార్యతో గొడవపడటం అంటే ఏమిటి?
కలలో భార్యతో వాదించడం, గొడవపడటం దురదృష్టకరం. సమీప భవిష్యత్తులో మీరు మీ వృత్తివ్యాపారాలలో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని ఈ కల సూచిస్తుంది. ఈ నష్టం మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఈ కల అశుభమైనదిగా పరిగణించబడుతుంది.
కలలో సంతోషకరమైన భార్యను చూడటం అంటే ఏమిటి?
మీ కలలో మీ భార్య సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తే, ఆ కల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అంటే మీరు త్వరలో సంపద పొందుతారు లేదా ధనవంతులు అవుతారు.
కలలో భార్య ఏడుపు చూడటం అంటే ఏమిటి?
కలలో మీ భార్య ఏడుస్తున్నట్లు మీరు చూస్తే, ఆ కల అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. భవిష్యత్తులో మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని సూచిస్తుంది.
ఇద్దరు భార్యలను కలలో చూడటం అంటే ఏమిటి?
మీకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు కల వస్తే? మరో లడ్డూ కావాలా నాయనా? కానీ, కలలో ఇద్దరు భార్యలు కనిపిస్తే అది అశుభం. రాబోయే రోజుల్లో మీ ఖర్చులు పెరుగుతాయని, దుబారా ఖర్చులు ఎక్కువవుతాయని ఈ కల సూచిస్తుంది. కలలో ఇద్దరు భార్యలు వచ్చినట్లయితే మీ ఆదాయం అంతా ఆవిరైపోవచ్చు, మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోవచ్చు.
గమనిక: ఇక్కడ పేర్కొన్న వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, వీటిని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇంటనెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి మాత్రమే ఇక్కడ అందివ్వడం జరిగింది. వీటిని మేము ధృవీకరించడం లేదు కూడా.
సంబంధిత కథనం