Silent heart attack: సైలెంట్ హార్ట్ ఎటాక్.. ఎలా గుర్తించాలంటే!
గుండెపోటులో ముఖ్యం లక్షణం ఛాతీ నొప్పి. అయితే అన్ని గుండెపోట్లలో చెస్ట్ పెయిన్ ఉండదు. మరి కొన్నిసార్లు నొప్పి చాలా తేలికగా ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికి ఛాతీలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే మాత్రం డాక్టర్ సంప్రదించడం మంచిది.
గుండెపోటుకు ముందు శరీరంలో వచ్చే కొన్ని లక్షణాలు హెచ్చరికలుగా ఉంటాయి. ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి, జలుబుతో చెమటలు పట్టడం, బలహీనంగా అనిపించడం వంటివి హార్ట్ ఆటాక్ లక్షణాలుగా ఉంటాయి. అయితే కొన్ని ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు వస్తుందని మీకు తెలుసా? ఏదో ఒక సమయంలో మీకు తెలియకుండానే గుండెపోటు వచ్చి ఉండవచ్చు. కానీ అది మీకు తెలియకపోవచ్చు. దీనినే 'Silent Heart Attack' అంటారు. ఈ రకమైన గుండెపోటులు చాలా ప్రమాదకరమైనది.
సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి?
'Silent Heart Attack'పై చాలా మందికి అవగాహన ఉండదు. దీని వల్ల సరియైన సమయంలో చికిత్స పొందలేరు. Silent గుండెపోటు కారణంగా ఛాతీ భాగం దెబ్బతీస్తుంది.
సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు ఎలా గుర్తించాలి
40 ఏళ్ళ వయసు దాటిని వారు రెగ్యులర్ చెకప్‌ల కోసం వైద్యుడి సంప్రదించాలి. గుండె కండరాలకు పని తీరు అధారంగా ఎలాంటి గుండెపోటు వచ్చిందో? లేదో? డాక్టర్లు గుర్తిస్తారు. దీని కోసం, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (EKG) లేదా కార్డియాక్ అల్ట్రాసౌండ్ ద్వారా సైలెంట్ హార్ట్ ఎటాక్‌ను నిర్ధారించవచ్చు. కొందరు వ్యక్తుల్లో సైలెంట్ హార్ట్ ఎటాక్ తర్వాత అలసట, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎవరికైనా రావచ్చు, మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ప్రభావితమవుతారు.
సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు
సైలెంట్ గుండెపోటు నిర్దిష్టమైన లక్షణాలు ఉండవు. కొన్ని లక్షణాలు ద్వారా సైలెంట్ హార్ట్ ఎటాక్‌ను గుర్తించవచ్చు. ఛాతీలో నొప్పిగా అనిపించడం, బాగా అలసిపోయినట్లు ఉండడం, ఏ పని చేసినా ఊపిరి ఆడకపోవడం, గుండెల్లో మంట, అజీర్ణం , నిరంతరం విశ్రాంతి తీసుకోకపోవడం వంటివి సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు. కాబట్టి మీకు ఏదైనా సమస్య అనిపిస్తే, మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.