Saturday Motivation | ఎక్కువగా ఆలోచించకండి డ్యూడ్.. హ్యాపీగా ఉండండి..-saturday motivational quote is don t think too much just do what makes you happy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation | ఎక్కువగా ఆలోచించకండి డ్యూడ్.. హ్యాపీగా ఉండండి..

Saturday Motivation | ఎక్కువగా ఆలోచించకండి డ్యూడ్.. హ్యాపీగా ఉండండి..

HT Telugu Desk HT Telugu
Apr 16, 2022 08:11 AM IST

అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు అని రజినీకాంత్ చెప్పారు. కానీ అతిగా ఆలోచించే ఎవరైనా సంతోషంగా గడిపినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. కొందరు ఎక్కువగా ఆలోచించి.. సంతోషకరమైన మూమెంట్స్​ని కూడా మిస్​ చేసుకుంటారు. ఎక్కువగా ఆలోచిస్తే ఏమొస్తుంది చెప్పండి తలనొప్పి తప్పా..

<p>అతిగా ఆలోచించవద్దు</p>
అతిగా ఆలోచించవద్దు

Motivational Quotes | ఆలోచించండి తప్పు లేదు.. కానీ అతి ఆలోచించారో కచ్చితంగా ముప్పే. ఏదైనా పని చేసే ముందు ఆలోచించడం అనేది చాలా మంచి విషయం. దాని వల్ల మనకు చాలాసార్లు కలిసి వస్తుంది. కొన్నిపనులు చేసే ముందు ఆలోచించాలి కూడా. కానీ అతిగా ఆలోచిస్తే.. వచ్చే అవకాశాలు కూడా దూరంగా వెళ్లిపోతాయి. అతిగా ఆలోచించి బుర్ర కరాబ్​ చేసుకోవడం తప్పా.. నయా పైసా ఉపయోగం కూడా ఉండదు. బెనిఫిట్​గా ఓవర్ స్ట్రెస్ (అధిక ఒత్తిడి), తలనొప్పి, చికాకులు వస్తాయి.

మనం ఆలోచించినంత మాత్రానా జరిగేది జరగకుండా ఆగిపోతుందా? లేదు కదా. కాబట్టి ఏ విషయాన్నైనా ఎక్కువ ఆలోచించకుండా.. మనసుకు నచ్చినది చేసేయండి. మనకు సంతోషాన్ని ఇస్తుంది అనిపించే దేనినైనా చేయొచ్చు. అసలే వీకెండ్. ఇప్పుడు కూడా అతిగా ఆలోచిస్తూ.. మీ రిలాక్సింగ్​ డే ని పాడు చేసుకుంటారా చెప్పండి? అలా ఆలోచిస్తూ.. కుర్చోనే బదులు.. మీకు ఏది హ్యాపినెస్ ఇస్తుందో.. దేనివల్ల మీరు సంతోషంగా ఉంటారో ఆ పని చేయండి. వీక్​ఎండ్​ అనే కాదు.. వీక్​ డేస్​లలో కూడా అతిగా ఆలోచించి మీ వర్క్​ డిస్టర్బ్ చేసుకోకుండా.. పనిపై శ్రద్ధ పెట్టండి. మనపని మనం చేసుకుంటూ ఉన్నప్పుడే జీవితం సాఫీగా వెళ్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం