Samsung Galaxy M13 Series : మార్కెట్లోకి గెలాక్సీ M13, M13 5G.. ధర ఎంతంటే..
Samsung Galaxy M13 Series : శాంసంగ్ గెలాక్సీ M13 5G, Samsung Galaxy M13ని.. సౌత్ కొరియా టెక్ దిగ్గజం Samsung విడుదల చేసింది. అయితే వాటి ఫీచర్లేంటో.. ధరలు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M13 Series : Samsung Galaxy M13, Samsung Galaxy M13 5Gలను ఆ సంస్థ.. ఈరోజు భారతదేశంలో లాంచ్ చేసింది. Samsung నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Samsung Galaxy M12ని విజయవంతం చేశాయి. స్మార్ట్‌ఫోన్‌ల స్పెక్స్‌ను కంపెనీ వెల్లడించనప్పటికీ.. Galaxy M13, Galaxy M13 5G రెండూ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి.
Samsung షేర్ చేసిన టీజర్ ఇమేజ్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 6000mAh బ్యాటరీ, 12GB వరకు RAMని కలిగి ఉన్నాయి. Samsung Galaxy M13 5G వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందవచ్చని టీజర్లో ఇప్పటికే చూసేశాం. అయితే Samsung Galaxy M13 డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. Samsung Galaxy M13, Samsung Galaxy M13 5G లాంచ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చేశారు.
రెండు స్మార్ట్‌ఫోన్‌లు రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటాయి. 4G ర్యామ్‌తో కూడిన Samsung Galaxy M13 ధర రూ.11,999, 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999. మరోవైపు 4GB, 6GB ర్యామ్‌తో కూడిన Samsung Galaxy M13 5G వరుసగా రూ. 13,999, రూ. 15,999గా నిర్ణయించారు. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. ICICI బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ. 1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
అమెజాన్ ద్వారా జూలై 23 నుంచి భారతదేశంలో విక్రయిస్తున్నారు. రెండు డివైజ్‌లు మిడ్‌నైట్ బ్లూ, ఆక్వా గ్రీన్, స్టార్‌డస్ట్ బ్రౌన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. కొత్త Samsung Galaxy M13, Samsung Galaxy M13 5G భారతదేశంలో అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. సామ్‌సంగ్ పరికరాలను ఎప్పుడు విక్రయిస్తారో వెల్లడించనప్పటికీ.. కొత్త M-సిరీస్ పరికరాలు జూలై 23 నుంచి విక్రయిస్తారని భావిస్తున్నారు.
సంబంధిత కథనం