Samsung Foldable | శాంసంగ్ నుంచి మడిచే ఫోన్లు Galaxy Z Flip4, Fold4 వచ్చేశాయి!
శాంసంగ్ తమ Galaxy Unpacked 2022 ఈవెంట్ లో భాగంగా Samsung Galaxy Z Fold 4 అలాగే Samsung Galaxy Z Flip 4 ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసింది.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎట్టకేలకు తమ లేటెస్ట్ జెనరేషన్ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసింది. ఆగష్టు 10, 2022న శాంసంగ్ నిర్వహించిన Galaxy Unpacked ఈవెంట్ 2022లో భాగంగా Samsung Galaxy Z Fold 4 అలాగే Samsung Galaxy Z Flip 4 ఫోన్‌లను విడుదల చేసింది. వీటితో పాటు Galaxy Watch 5 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లను, ఇంకా Buds 2 Pro ఇయర్‌బడ్లను కూడా కంపెనీ విడుదల చేసింది. భారత్ సహా ఇతర దేశాల మార్కెట్లలలోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇందులో Samsung Galaxy Z Flip4 ధరను $1,000గా (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 79 వేలు) నిర్ణయించగా మరొక మోడల్ Galaxy Z Fold4 ధర $1,780 (రూ. 1.40 లక్షలు)కు లభించనుంది. ఇవి శాంసంగ్ నుంచి వచ్చిన నాల్గవ తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు హైపర్-ఫాస్ట్ 5Gతో పనిచేస్తాయి. భారత మార్కెట్లో ఈ రెండు ఫోన్లు వచ్చే వారం నుండి ప్రీ-ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన దేశాలలో ఆగస్టు 26 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవుతాయి.
ఫ్లిప్4, ఫోల్డ్ 4.. ఈ రెండు ఫోన్లు అన్నింటికంటే అత్యంత కఠినమైన ఫోల్డబుల్ ఫోన్లుగా శాంసంగ్ పేర్కొంది. వీటి కవర్ స్క్రీన్ వెనుక గ్లాస్‌పై ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+తో పాటు ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌లు, కవర్‌తో కూడిన కీలు వస్తాయి.
ఈ ఫోన్లలో అండర్ డిస్‌ప్లే కెమెరా, 7.6-అంగుళాల డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ వంటి ప్రీమియం స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
Samsung Galaxy Z Flip4 ప్రత్యేకతలు
Samsung Galaxy Z Flip 4 కాంపాక్ట్ క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తుంది. ఇది బ్లూ, బోరా పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మూడు RAM + స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంటుంది - 8GB+128GB, 8GB+256GB అలాగే 8GB+512GB. కాన్ఫిగరేషన్ల ఆధారంగా ధరలు ఉండనున్నాయి. ఈ ఫోన్ హ్యాండ్స్-ఫ్రీ వీడియోని షూట్ చేయగలదు. పూర్తి గ్రూప్ సెల్ఫీలను క్యాప్చర్ చేయగల సామర్థ్యంతో వస్తుంది. ఈ ఫ్లెక్సిబిలిటీని ఉపయోగించుకోవడానికి Samsung FlexCamని కూడా ప్రవేశపెట్టింది. ఇందులోని 3,700mAh బ్యాటరీ దాదాపు 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
Samsung Galaxy Z Fold 4 ప్రత్యేకతలు
Samsung Galaxy Z Fold 4 ఫ్లెక్స్ మోడ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12L ఆధారిత పనితీరు కలిగిన మొదటి ఫోన్ ఇదే. మల్టీటాస్కింగ్ కోసం కొత్త టాస్క్‌బార్ మీ PCకి సమానమైన లేఅవుట్‌ను అందిస్తుంది. కాన్ఫిగరేషన్లు పరిశీలిస్తే ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ అలాగే టాప్-ఆఫ్-ది-లైన్ 12GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది. బీజ్, గ్రీన్, ఫాంటమ్ బ్లాక్ కవర్‌లలో అందుబాటులో ఉంటుంది. Samsung.com ప్రత్యేకమైన బర్గండి కలర్ ఆప్షన్ కూడా ఉంది.
సంబంధిత కథనం