Red flags in relationships: మీ బంధంలో రెడ్ ఫ్లాగ్స్ విస్మరించారా? ఈ 7 కారణాలు తెలుసుకోండి
Red flags in relationships: రిలేషన్‌షిప్‌లో రెడ్ ఫ్లాగ్ గమనించినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడానికి 7 కారణాలను ఒక థెరపిస్ట్ వివరించారు. అవేంటో ఒకసారి చూడండి.
అన్ని రిలేషన్‌షిప్పులూ తీరం చేరుతాయనుకుంటే పొరపాటే. అన్నీ శాశ్వత బంధాలుకావు. కొన్ని కొంత కాలం తరువాత మనకు నిజాలను గ్రహించేలా చేస్తాయి. అవి మనకు సరిపోలినవి కాదని, అనుకూలమైనవి కాదని తెలుస్తాయి. రిలేషన్‌షిప్స్‌లో ఒకరు తమ విషతుల్యమైన లక్షణాలను, ముసుగు లేకుండా అసలైన మనస్తత్వాన్ని ప్రదర్శించినప్పుడు భాగస్వామికి నష్టం చేకూరుస్తాయి. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా ఈ ప్రభావం ఉంటుంది.
మనం అలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు చాలా సమయం తీసుకుంటాం. మంచి కోసం ఆ బంధానికి ముగింపు పలుకుతాం. అయితే మనం ముందే ఆయా బంధాల్లో రెడ్ ఫ్లాగ్స్ గమనిస్తే సమస్య ఉన్నట్టు ముందుగా గుర్తించవచ్చు. కానీ కూరిమి గల దినములలో నేరంలేవీ కానరావన్నట్టు… రెడ్ ఫ్లాగ్స్ గుర్తించడంలో విఫలమవుతుంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది?
అయితే థెరపిస్ట్ కుబురిక్ ఈ పరిస్థితిని విశ్లేషించారు. తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో దీనిపై చర్చించారు. ‘వాస్తవికంగా ప్రతి బంధం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కలిగి ఉంటుంది. వాటిని గుర్తించడం, వాటిని భరించేందుకు సిద్ధంగా ఉన్నామా లేదా నిర్ణయించుకోవడం మన కర్తవ్యం..’ అని వివరించారు. ఒక బంధంలోని వ్యక్తులు రెడ్ ఫ్లాగ్స్ ఎందుకు విస్మరిస్తారో చెప్పేందుకు 7 కారణాలను ఆమె వివరించారు.
ఫోకస్: మనం భాగస్వామి నుంచి ఎదురయ్యే రెడ్ ఫ్లాగ్స్ పట్టించుకోకుండా వారి సామర్థ్యం, బంధంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడాన్నే మనం ఎంచుకుంటాం
చిన్నవిగా చూడడం: బంధంలో మనం తరచుగా రెడ్ ఫ్లాగ్స్ చూస్తుంటాం. ఆయా అంశాలు అనారోగ్యకరమైనవని మనకు తెలుసు. కానీ వాటిని పరిష్కరించుకోకుండా చిన్నవిగా చేసి చూసేందుకు ఇష్టపడతాం.
బంధం కొనసాగుతుందని ఆశించడం: చాలా సమయం, శక్తి, భావోద్వేగాలు వెచ్చించినందున రిలేషన్‌షిప్ కొనసాగుతుందని ఆశిస్తాం. అందువల్ల మనకు కనిపించే రెడ్ ఫ్లాగ్స్‌ను సౌకర్యవంతంగా విస్మరిస్తాం.
మార్పు: రెడ్ ఫ్లాగ్స్ గమనించి అవతలి వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చేందుకు యత్నిస్తాం. రెడ్ ఫ్లాగ్స్ విస్మరిస్తాం.
ఒంటరితనం: ఒంటరితనం ఒక పెద్ద కారణం అవ్వొచ్చు. విషతుల్యమైన లక్షణాలను సమ్మతిస్తూ, వారు మనతో కొనసాగాలని ఆశించేందుకు ఈ ఒంటరితనం కారణమవుతుంది.
ఆశ: రెడ్ ఫ్లాగ్స్‌ను గమనించినా, వాటి విషయంలో తమ జడ్జిమెంట్ తప్పని, రానున్న రోజుల్లో అంతా మారుతుందని ఆశలు పెట్టుకోవడం.
విశ్వాసం: మనకు ఇంతకంటే మంచి వ్యక్తి దొరకరనే నమ్ముతాం. అందుకే వారిని అంటిపెట్టుకుంటాం.