Bathukamma Songs : ధర్మపురి వేములవాడ ఉయ్యాలో.. ఈ బతుకమ్మ పాట తెలుసా?
Bathukamma Song Lyrics : తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఆడపడుచుల బతుకమ్మ పాటలు ఊరూరా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని ఎప్పుడూ వినని పాటలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని HT Telugu మీకు అందిస్తుంది.
బతుకమ్మ పాటలు వినేందుకు చాలా బాగుంటాయి. కొన్ని పాటలు తరతరాల నుంచి ఇప్పటి వరకూ వచ్చాయి. మరికొన్ని పాటలు విననివి కూడా ఉన్నాయి. ధర్మపురి వేములవాడ ఉయ్యాలో అనే పాటను కొన్ని ఊర్లలో పాడుతుంటారు. పూర్తి పాట మీకోసం..
ధర్మపురి వేములవాడ ఉయ్యాలో పాట
ధర్మపురి వేములవాడ ఉయ్యాలో
తపస్సు ఉన్నది ఉయ్యాలో
స్నానానికి రావయ్య ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
ఎండియి కొప్పెర్లా ఉయ్యాలో
చన్నీళ్లు తోడి ఉయ్యాలో
ఆ నీళ్లు ఈ నీళ్లు ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
దండాన పట్టుదోతి ఉయ్యాలో
అమరి యున్నది ఉయ్యాలో
కట్టుకొని పోవయ్య ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
ధర్మపురి వేములవాడ ఉయ్యాలో
తపస్సు ఉన్నది ఉయ్యాలో
కుంకుమ గాయల్ల ఉయ్యాలో
అమరి యున్నది ఉయ్యాలో
పెట్టుకొని పోవయ్య ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
గందాపి గిన్నెల్లా ఉయ్యాలో
అమరి యున్నది ఉయ్యాలో
పంచుకొని పోవయ్య ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
పస్పు తప్పుకుల్ల ఉయ్యాలో
అమరి యున్నది ఉయ్యాలో
పెట్టుకొని పోవయ్య ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
ధర్మపురి వేములవాడ ఉయ్యాలో
తపస్సు ఉన్నది ఉయ్యాలో
ఆకుల్లా అచ్చంతాలు ఉయ్యాలో
అమరి యున్నది ఉయ్యాలో
పెట్టెల పన్నీరు ఉయ్యాలో
అమరి యున్నది ఉయ్యాలో
అమరి యున్నది ఉయ్యాలో
చల్లుకొని పోవయ్య ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
ధర్మపురి వేములవాడ ఉయ్యాలో
తపస్సు ఉన్నది ఉయ్యాలో
స్నానానికి రావయ్య ఉయ్యాలో
జడల శంకరుడ ఉయ్యాలో
హిమవంతునింట్ల పుట్టి ఉయ్యాలో పాట
హిమవంతునింట్ల పుట్టి ఉయ్యాలో
హిమవంతునింట్ల పుట్టి ఉయ్యాలో
హిమవంతునింట్ల పెరిగి ఉయ్యాలో
విదియు పోయి తదియ నాడు ఉయ్యాలో
కాంతలంతా కూడి ఉయ్యాలో
గన్నేరు కొమ్మ తెచ్చి ఉయ్యాలో
గౌరి పూజలు చేసి ఉయ్యాలో
వత్తి పొత్తులు పెట్టి ఉయ్యాలో
ఒడిబియ్యం పోసి ఉయ్యాలో
ఒప్పైన సద్ది కట్టి ఉయ్యాలో
శంభునికి అప్పగించి ఉయ్యాలో
మాయమ్మ గౌరి దేవి ఉయ్యాలో
పోయీ రావమ్మా ఉయ్యాలో
అత్తవాడల్లకు ఉయ్యాలో
పోయీ రావమ్మ ఉయ్యాలో
చీరెలు కొదవనమ్మా ఉయ్యాలో
సారెలు కొదవనమ్మ ఉయ్యాలో
ఆరు నెలలున్నాది ఉయ్యాలో
సంక్రాంతి పండుగా ఉయ్యాలో
పండుగ నాటికి ఉయ్యాలో
నిను తోలుకోస్తమ్మా ఉయ్యాలో
కూర్చుండ పీటేస్తే ఉయ్యాలో
కుదుర్ల దొంతులిస్తా ఉయ్యాలో
ఆడేటి దొంతులిస్తా ఉయ్యాలో
అపరంజి మెట్లేస్తా ఉయ్యాలో
మల్లెమెుగ్గ చీరెలిస్తా ఉయ్యాలో
అద్దాల రవికలిస్తా ఉయ్యాలో
నీకు దగ్గ సొమ్ములిస్తా ఉయ్యాలో
గంధం గిన్నెలిస్తా ఉయ్యాలో
నీలాల కమ్మలిస్తా ఉయ్యాలో
నిలువుటద్దమిస్తా ఉయ్యాలో
ఎక్కే అందలిస్తా ఉయ్యాలో
పట్టపుటేనుగు లిస్తా ఉయ్యాలో
పది నూర్ల రూకలిస్తా ఉయ్యాలో
పంచకల్యాణి నిస్తా ఉయ్యాలో
మాయమ్మ గౌరమ్మా ఉయ్యాలో
పోయిరా గౌరమ్మా ఉయ్యాలో
పోయిరా గౌరమ్మా ఉయ్యాలో
మళ్లిరా గౌరమ్మా ఉయ్యాలో