Breakfast Drink| హీట్​ని తగ్గించి.. ఎనర్జీనిచ్చే అంజీర్ మిల్క్ షేక్-protein and fiber rich breakfast drink anjeer milkshake recipe and benefits here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Protein And Fiber Rich Breakfast Drink Anjeer Milkshake Recipe And Benefits Here

Breakfast Drink| హీట్​ని తగ్గించి.. ఎనర్జీనిచ్చే అంజీర్ మిల్క్ షేక్

HT Telugu Desk HT Telugu
May 11, 2022 09:34 AM IST

ఉదయాన్నే జిమ్​ చేసి వచ్చిన తర్వాత మీకు తక్షణమే శక్తి కావాలన్నా, ప్రోటీన్ ఫైబర్ రిచ్​గా ఉండే డ్రింక్​ తాగాలన్నా ఇప్పుడు మీరు తెలుసుకునే డ్రింక్ చాలా మంచి ఎంపిక. అంతే కాకుండా సమ్మర్​లో కలిగే వేడి నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంతకీ ఏంటా డ్రింక్ అనుకుంటున్నారా? అదే అంజీర్​ మిల్క్ షేక్.

అంజీర్ మిల్క్ షేక్
అంజీర్ మిల్క్ షేక్

Anjeer Milkshake | సమ్మర్​లో హీట్​ను తగ్గించే బ్రేక్​ఫాస్ట్​ను ఎవరు వద్దనగలరు. పైగా ఇది తక్షణ శక్తి ఇస్తుందంటే అస్సలు ఆగము. దీనిని చిటికెలో తయారు చేసుకోవచ్చు. వంటగదిలో కష్టపడాల్సిన అవసరమే లేదు. దీనిని తీసుకుంటే ఒకటా, రెండా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అందుకే సమ్మర్​లో అంజీర్ మిల్క్ షేక్ తీసుకోమంటున్నారు నిపుణులు. దాని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* అంజీర్ - 4 (రాత్రంతా నానబెట్టాలి)

* పాలు - 200ml (చల్లనివి)

* యాలకుల పొడి - కొంచెం (ఆప్షనల్)

* బాదం = 2 తురుముకోవాలి

* చియా సీడ్స్ - 2 స్పూన్స్ (నానబెట్టినవి)

తయారీ విధానం

అంజీర్​ను మిక్సీలో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. దానిలో పాలు, యాలకుల పొడి వేసి మరోసారి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత.. మరో గ్లాసులో చియా సీడ్స్ వేసి.. ఈ మిశ్రమాన్ని కొంత వేయాలి. అనంతరం మరికొన్ని చియాసీడ్స్ వేసి.. మళ్లీ అంజీర్ మిక్స్​ను వేసుకోవాలి. దానిపై బాదం పలుకులతో గార్నీష్ చేసుకోవాలి.

దీనిలో మొత్తం 150 కేలరీలు మాత్రమే ఉంటాయి. ప్రోటీన్ 7.8 గ్రాములు ఫైబర్ 2.4 గ్రాములు, కొవ్వులు 3.0 గ్రాములు కార్బ్స్ 23.2 గ్రాములు ఉంటాయి. కాబట్టి మీరు దీనిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు.

ఇది ఎనర్జీ మాత్రమే కాదు.. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. స్ట్రెంత్ బిల్డ్ చేస్తుంది. పైగా దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. సమ్మర్​లో డ్రైఫ్రూట్స్​ను రాత్రంతా నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలోని హీట్​ తగ్గుతుంది. అంజీర్​ను వేసవిలో తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలన్ని అందుతాయి. దీనిని బ్రేక్​ఫాస్ట్​కే కాదు.. లంచ్ మధ్యలో కూడా తీసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్