Oppo Pad Air । రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభించే ఒప్పొ తొలి అండ్రాయిడ్ టాబ్లెట్!-oppo pad air tablet goes for sale online know features and price ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oppo Pad Air । రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభించే ఒప్పొ తొలి అండ్రాయిడ్ టాబ్లెట్!

Oppo Pad Air । రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభించే ఒప్పొ తొలి అండ్రాయిడ్ టాబ్లెట్!

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 12:51 PM IST

ఒప్పో కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో Oppo Pad Air అనే సరికొత్త టాబ్లెట్ ఫోన్‌ విడుదల చేసింది. దీని కొనుగోళ్లు ప్రారంభమైనాయి. ఫీచర్లు, ధర, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

<p>Oppo Pad Air</p>
Oppo Pad Air

స్మార్ట్‌ఫోన్ మేకర్ Oppo గత వారం భారతీయ మార్కెట్లో తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. Oppo Pad Air పేరుతో విడుదలైన ఈ మిడ్-రేంజ్ టాబ్లెట్ ఫోన్‌ ఇప్పుడు Flipkartలో కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ ఒప్పో ప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ ఒక మల్టీమీడియా-ఫోకస్డ్ పరికరం. ఇందులో ప్రధాన అంశాలు పరిశీలిస్తే 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్‌ని కలిగి ఉంది. ఈ టాబ్లెట్లో Qualcomm Snapdragon 680 ప్రాసెసర్, 4GB RAM అలాగే 7100mAh బ్యాటరీ వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. Oppo ప్యాడ్ ఎయిర్ ఛార్జింగ్, డేటా బదిలీ కోసం టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది. ఇది రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి, మీరు మీ టాబ్లెట్ సహాయంతో మీ స్మార్ట్‌ఫోన్, ఇతర పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.

స్క్రీన్ పైన ఒత్తిడిపడకుండా ఇది Oppo Stylusకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్‌లో మైక్రో-SD కార్డ్ స్లాట్ కూడా ఉంది, కాబట్టి అదనంగా 512GB వరకు స్టోరేజ్ సామర్థ్యాన్ని విస్తరించుకోవచ్చు.

ఇంకా Oppo Pad Airకి సంబంధించి మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ధర ఎంత? తదితర వివరాలు ఈ క్రింద తెలుసుకోండి.

Oppo Pad Air టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10.36 -అంగుళాల IPS LCD 2K డిస్‌ప్లే
  • 4 GB RAM, 64GB/ 128 GB స్టోరేజ్ సామర్థ్యం, మైక్రో SD కార్డ్ స్లాట్
  • Qualcomm Snapdragon 680 ప్రాసెసర్
  • వెనకవైపు 8MP కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 7100 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జింగ్

Oppo ప్యాడ్ ఎయిర్ ధర 4GB + 64GB కాన్ఫిగరేషన్ కోసం రూ. 16,999/-.

అలాగే 4GB + 128GB వేరియంట్ కోసం ధర రూ. 19,999/-

కనెక్టివిటీ పరంగా ఈ టాబ్లెట్ PCలో బ్లూటూత్ 5.1తో పాటు ప్రామాణిక సెన్సార్లు, Wi-Fi 5 ఆప్షన్స్, టైప్-సి పోర్ట్‌ ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం