ONGC: ఓఎన్‌జీసీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అప్లై చేశారా..? ఈ రోజే చివరి తేదీ-ongc non executive recruitment last date to apply for 922 vacancies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ongc Non-executive Recruitment: Last Date To Apply For 922 Vacancies

ONGC: ఓఎన్‌జీసీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అప్లై చేశారా..? ఈ రోజే చివరి తేదీ

HT Telugu Desk HT Telugu
May 28, 2022 02:53 PM IST

ONGC recruitment 2022: ఓఎన్‌జీసీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 900పైగా పోస్టులకు భర్తీ చేయనున్నారు.

ONGC
ONGC

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)లో 900 పైగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని  అభ్యర్థులు ONGC అధికారిక వెబ్‌సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు: జనరల్/OBC/ EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 300. SC/ST/PWBD/ మాజీ సైనికులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:  కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తర్వాత PST/PET/స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్  ఉంటుంది.

 దరఖాస్తు  విధానం

 ONGC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

హోమ్‌పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

తర్వాత, "Recruitment of Non-Executives across all work-centers in ONGC vide Advertisement No. 2/2022 (R&P)'' లింక్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫారమ్‌ను నిపండి

దరఖాస్తు రుసుము చెల్లించండి

WhatsApp channel

సంబంధిత కథనం