OnePlus Nord Buds : విడుదలకు సిద్ధమైన నార్డ్ బడ్స్.. క్లారిటీ ఇచ్చిన వన్​ప్లస్ -oneplus nord buds ce tws earbuds launch soon in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oneplus Nord Buds : విడుదలకు సిద్ధమైన నార్డ్ బడ్స్.. క్లారిటీ ఇచ్చిన వన్​ప్లస్

OnePlus Nord Buds : విడుదలకు సిద్ధమైన నార్డ్ బడ్స్.. క్లారిటీ ఇచ్చిన వన్​ప్లస్

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 22, 2022 04:24 PM IST

ప్రముఖ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ తమ బ్రాండ్ నుంచి ఇటీవల OnePlus Nord 2T 5G పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు OnePlus Nord Buds CE TWS ఇయర్​బడ్స్​ను త్వరలో భారత్​లో విడుదల చేయడానికి సిద్ధమైంది.

OnePlus Nord Buds CE TWS
OnePlus Nord Buds CE TWS

OnePlus Nord Buds CE TWS ఇయర్‌బడ్స్ త్వరలో భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. నార్డ్ బడ్స్ CE ఎంట్రీ-లెవల్ TWS విభాగంలో నోర్డ్ హోల్డ్‌ను బలపరుస్తుంది. ఈ సంవత్సరం ఆరంభంలో OnePlus Nord బడ్స్‌ను ప్రారంభించి.. ఎంట్రీ-లెవల్ TWS విభాగంలోకి ప్రవేశించింది. రాబోయే TWS ఇయర్‌బడ్‌లు వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ వాటర్ డౌన్ వెర్షన్​గా రూపొందించింది. ఎందుకంటే 'CE' మోనికర్‌తో OnePlus పరికరాలు సాధారణంగా కంపెనీ అందించే ఇతర ఉత్పత్తుల కంటే సరసమైనవి.

ప్రస్తుతానికి OnePlus, OnePlus Nord Buds CE ఎలాంటి స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. కానీ.. TWS ఇయర్‌బడ్‌లు ఇటీవల బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ సైట్‌లో ఉన్నాయి. బ్లూటూత్ SIG వెబ్‌సైట్‌లో OnePlus Nord Buds CE TWS ఇయర్‌బడ్‌లు మోడల్ నంబర్ E506Aని కలిగి ఉన్నాయి. MySmartPrice నివేదిక ప్రకారం.. OnePlus Nord Buds CE కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2కి మద్దతు ఇస్తుంది. X21E2_07_A.1.0.0గా లేబుల్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తుంది.

ఈ వారం వన్‌ప్లస్ తన రెండవ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 2022ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వన్‌ప్లస్ 10T 5Gతో పాటు ఆక్సిజన్‌ఓఎస్ 13ని న్యూయార్క్ నగరంలో.. ఆగస్ట్ 3, 2022న వ్యక్తిగతంగా లాంచ్ చేస్తుంది. OnePlus 10T Qualcomm తాజా పవర్‌తో అందుబాటులో ఉంది. అత్యంత శక్తివంతమైన Snapdragon 8+ Gen 1 మొబైల్ చిప్‌సెట్ మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి.. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ శక్తిని అందిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్